Koti Deepotsavam 2022: అక్టోబర్ 31వ తేదీన ప్రారంభమైప భక్తి టీవీ కోటి దీపోత్సవం 9వ రోజుకి చేరింది. ఈ నెల 14వ తేదీ వరకు ఈ మహా క్రతువు సాగనుంది. మంగళవారం నాడు కోటి దీపోత్సవం కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. ఈరోజు తొలుత డా.శంకరమంచి రామకృష్ణశాస్త్రి స్తోత్ర పారాయణం చేశారు. అనంతరం కోటి దీపోత్సవ ప్రాంగణంలో గ్రహణమోక్ష అనంతరం నదీజలాలతో మహా సంప్రోక్షణ చేశారు. చిట్యాలకు చెందిన శ్రీ హరిహర స్మార్థ వేదపాఠశాల విద్యార్థులు…
వరంగల్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘కాకతీయ వైభవ సప్తాహం’ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సందడి చేసింది. ఈ ఛాలెంజ్‌లో కాకతీయ 22వ వారసుడైన కమల్ చంద్రభంజ్ దేవ్ పాల్గొని, స్వయంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాకతీయుల పాలనలో తమ పూర్వీకులు ప్రకృతికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని, అందులో భాగంగానే గొలుసు చెరువులు తవ్వించారని చెప్పారు. అడవుల్ని రక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారని, ఇప్పుడు ఆ ఒరవడి కేసీఆర్…
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన తాజా సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన సల్మాన్ ఖాన్, టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5.0 లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో మొక్క ఒక్కో మనిషికి సరిపడా ఆక్సిజన్‌ను అందిస్తుందని తెలిపారు. మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు.…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఇప్పటికే ఎంతోమందితో మొక్కలు నాటిస్తున్నారు. సెలబ్రిటీలు కూడా ఈ మొక్కల ఉద్యమంలో విరివిగా పాల్గొంటూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ రూపాన్ని రావి ఆకుపై చిత్రించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ముక్ర కె గ్రామ సర్పంచ్ మీనాక్షి గాడ్గే రావి ఆకుపై సంతోష్ చిత్రాన్ని…
ఆమెకు చెట్లు పెంచడం మాత్రమే తెలుసు.. ప్రకృతితో మమేకం కావడమే ఆమె జీవితం.. అందుకే ఈ దేశం ఆమెను “వృక్షమాత” అని కీర్తిస్తుంది. ఆమే సాలుమారద తిమ్మక్క. 111 యేండ్లు వచ్చినా.. చక్కగా నుడుస్తూ వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆశీర్వదించి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. అంతేకాదు, 2016లో బీబీసీ ఛానెల్ విడుదల చేసిన అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో తిమ్మక్క స్థానం దక్కించుకున్నారు. అంతటి మహానుభావురాలు రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్…