అమరావతి: సచివాలయంలోని తన కార్యాలయంలో కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఈరోజు ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రెండు కీలక ఫైళ్లపై ఆయన తొలి రెండు సంతకాలను చేశారు. తొలి సంతకాన్ని విశాఖలో లక్ష మంది మహిళలకు ఇళ్ళు కట్టించే ఫైలుపై చేశారు. రెండో సంతకాన్ని గృహ నిర్మాణ లబ్దిదారులకు ఇచ్చే 90 బస్తాల సిమెంట్‌ను 140 బస్తాలకు పెంచే ఫైలుపై చేశారు. అనంతరం సీఎం…
జగన్ మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. 25 మంది మంత్రులతో జగన్ కేబినెట్ కొలువుదీరింది. అయితే, ఆశించిన మంత్రిపదవి రాకపోవడంతో కొంతమంది ఎమ్మెల్యేలు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే తనకు మంత్రి పదవి రాలేదంటూ కామెంట్లు చేయడం విశేషం. సీఎం జగన్ చుట్టూ ఓ కోటరీ ఉంది. నామినేటెడ్ పదవులు పొంది.. సీఎం క్యాంప్ ఆఫీస్…
స్వంత పార్టీకి చెందిన నేతపైనే అదే పార్టీకి చెందిన మహిళా నేత పంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం వైసీపీ నాయకురాలు జక్కా లీలావతి ప్రెస్ మీట్ పెట్టారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ వల్ల తమకు ప్రాణహాని ఉందన్నారు లీలావతి. నా భర్త కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం పడతడిక సర్పంచ్ ప్రదీప్ కుమార్. గతంలో నాపై ,నా భర్తపై కేసులు పెట్టి వేధించారు. నా భర్తకు ఎమ్మెల్యే జోగిరమేష్ కొంతమంది వ్యక్తులు చేత…
సీఎం జగన్ వైపు కన్నెత్తి చూసినా.. లోకేష్ తాట తీస్తామని హెచ్చరించారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్. ఒక అడుగు వేస్తే తాటి మట్టలతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని… ఇది ఆరంభం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. అయ్యన్నపాత్రుడు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయని… ఇటువంటి వ్యక్తులను చంద్రబాబు ప్రోత్సాహిస్తున్నాడా ? అని నిలదీశారు. చంద్రబాబుకు నిరసన చెప్పటానికి వెళితే నా పై దాడి చేశారని… చంద్రబాబు నోటిని ఫినాయిల్ తో కడగాలని నిప్పులు చెరిగారు.…
ఒకరు మాజీ మంత్రి. ఇంకొకరు అమాత్య అనిపించుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్న ఎమ్మెల్యే. ఇద్దరూ బీసీ సామాజికవర్గమే. రెండున్నరేళ్ల కేబినెట్ ప్రక్షాళన వారిని ఊరిస్తోంది. బెర్త్ కోసం ఎవరి లెక్కలు వారివే. మరి.. మంత్రివర్గంలో చేరడానికి వారు పెట్టుకున్న కొలమానం ఏంటి? ఎవరు ఏ రూట్‌ను ఎంచుకున్నారు? కేబినెట్లో బెర్త్ కోసం పార్థసారథి, జోగి రమేష్ ఆశలు ఆర్నెళ్ల తర్వాత జరిగే మంత్రివర్గ ప్రక్షాళనలో బెర్త్ కన్ఫామ్ చేసుకునేందుకు కృష్ణాజిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే కసరత్తు…
ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఆయన అరెస్ట్ ను వైసీపీ సమర్థిస్తుంటే.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. ఈ తరుణంలో ఏపీ అసెంబ్లీ వేదికగా ఎంపి రఘురామకృష్ణరాజుపై ఎమ్యెల్యే జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటుదారుల సంఘానికి అధ్యక్షుడు చంద్రబాబు అయితే.. ఉపాధ్యక్షుడు రఘురామ కృష్ణరాజు అని ఆయని ఫైర్ అయ్యారు. వైసీపీ పార్టీ గుర్తు, సిఎం జగన్ ఫోటోతో రఘురామకృష్ణరాజు గెలిచారని గుర్తు చేశారు. ఆయన ఎంపి పదవీకి రాజీనామా…