అవనిగడ్డ చేరుకున్నారు ముఖ్యమంత్రి జగన్. ముఖ్యమంత్రి జగన్‌కు హెలిప్యాడ్ దగ్గర స్వాగతం పలికారు మంత్రులు ధర్మాన ప్రసాదరావు, జోగి రమేష్, రోజా, జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు. ముఖ్యమంత్రి జగన్ సభకు భారీగా తరలివచ్చారు ప్రజలు… సభా ప్రాంగణంలో ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్లింది ఓ వృద్ధురాలు.. అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు వైద్యాధికారి రత్నగిరిరావు.
నిషేధిత భూముల జాబితా నుండి షరతు గల పట్టా భూముల తొలగింపు కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటుచేసిన ఫోటో సెషన్ లో పాల్గొన్నారు. రైతులతో ముచ్చటించారు. 22,042 మంది రైతులకు ఈ విధానం వల్ల లబ్ధి చేకూరనుంది. రైతులతో కలిసి జగన్ ఫోటోలు దిగారు.