అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్యాయ్‌ని గుర్తు తెలియని వ్యక్తి ఢీ కొట్టిన సంఘటన కలకలం రేపుతోంది. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి డెలావర్‌లోని వైట్ హౌజ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి వైట్ హౌజ్ ముందు ఓ వ్యక్తి కారుతో బీభత్సం సృష్టించాడు. తన కారుతో బైడెన్ కాన్వాయ్‌ని ఢీ కొట్టాడు. ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు సంఘటన స్థలంలోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో…
US President Joe Biden and First Lady Jill Biden Safe After Car Crash: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్‌లోని వాహనాన్ని ఓ ప్రైవేటు కారు ఢీకొంది. అమెరికా కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి డెలావర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన జరిగిన సమయంలో అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ అధ్యక్ష వాహనంలో కూర్చుని ఉండగా.. జో బైడెన్ వాహనానికి సమీపంలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు, ప్రథమ మహిళ సురక్షితంగా ఉన్నట్లు…
Joe Biden: రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వచ్చే నెలలో భారత్‌కు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వచ్చే ఏడాది జనవరిలో కాకుండా వేరే తేదీలో క్వాడ్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించాలని భారతదేశం పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
శాన్‌ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సుకు జో బైడెన్ ఆహ్వానం మేరకు జిన్‌పింగ్ వెళ్లారు. ఈ సమావేశం తర్వాత కాలిఫోర్నియాలో అమెరికా అధినేత జో బైడెన్- చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ భేటీ కానున్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మనవరాలు నవోమీ బిడెన్ భద్రతలో భారీ లోపం వెలుగు చూసింది. ముగ్గురు దుండగులు నవోమి ప్రయాణిస్తున్న కారు అద్దాలు పగులగొట్టేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. దీంతో కారుపై దాడి చేయడాన్ని చూసి.. నవోమి భద్రత కోసం మోహరించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు.
Joe Biden: గత 20 రోజులుగా ఇజ్రాయిల్-హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడిని హమాస్ ఉగ్రవాదాలు దారుణమైన ఊచకోతకు పాల్పడ్దారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాపై వైమానికి దాడులు నిర్వహిస్తోంది. అయితే పటిష్టమైన నిఘా వ్యవస్థ, మొస్సాద్ వంటి వ్యవస్థలు ఉన్నా కూడా ఇజ్రాయిల్, పొరుగున పాలస్తీనా గాజా నుంచి ఎదురయ్యే దాడిని కనిపెట్టలేకపోయింది.
Israeli–Palestinian Conflict: ఇజ్రాయిల్- పాలస్తీనా మధ్య యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్న సంగతి అందరికి సుపరిచితమే. ఈ మారణహోమంలో అమాయక ప్రజలు ఆహుతైపోతున్నారు. ఇజ్రాయిల్ పైన హమాస్ చేసిన దాడుల్లో 1,400 మందికి పైగా మరణించగా.. ఇజ్రాయిల్ గాజా పైన చేసిన ప్రతిస్పందన దాడిలో దాదాపుగా 3,500 మంది మరణించారు. ప్రస్తుతం గాజా పరిస్థితి దయానియ్యంగా మారింది. ఈ నేపథ్యంలో ఈజిప్టు మానవతా సహాయానికి ముందుకు వచ్చింది. అయితే జరుగుతున్న ఈ యుద్ధఖాండ పైన స్పందించిన అగ్రరాజ్యం అమెరికా…
Joe Biden: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో ఇజ్రాయిల్‌కి అమెరికా మద్దతు తెలియజేసేందుకు ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ రోజు ఆ దేశానికి వెళ్లారు. ఇజ్రాయిల్ పై హమాస్ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయిల్ పీఎం బెంజిమిన్ నెతన్యాహుతో సమావేశమయ్యారు. ఇరువురు నాయకుడు కొనసాగుతున్న యుద్ధం గురించి చర్చించారు. హమాస్ ఉగ్రవాదులు ఐసిస్ కన్నా క్రూరంగా ప్రవర్తించారని వ్యాఖ్యానించారు.