ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు ఉత్తర కొరియా వేలాది మంది సైనికులను పంపించింది. ఇప్పటికే రష్యాలోని కుర్క్స్ ప్రాంతంలో మోహరించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది.
Joe Biden: హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్ అగ్రనేత సిన్వర్‌ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టడం యావత్ ప్రపంచానికి శుభ సూచకం అన్నారు.
పశ్చిమాసియా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. వైట్‌హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరాన్ చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేసే అవకాశం ఉందని బైడెన్ చెప్పారు.
ఇరాన్ క్షిపణి దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయం పెరుగుతోంది. కాగా, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతపై అభివృద్ధి చెందిన దేశాల సమూహం జీ-7 అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ప్రస్తుత ఛైర్‌పర్సన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఈ సమావేశానికి పిలుపునిచ్చారు.
ఉక్రెయిన్, పశ్చిమాసియాల్లో సంక్షోభాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో చివరి ప్రసంగం చేశారు. ఉక్రెయిన్‌కు అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు అండగా నిలిచియాయని తెలిపారు.
అమెరికా నుంచి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం వచ్చింది. తమ దేశ పర్యటనకు రావాల్సిందిగా ప్రెసిడెంట్ బైడెన్ మోడీకి ఆహ్వానం పంపించారు. దీనికి మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, భారత ప్రధాని అమెరికా పర్యటనపై నేడు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన, షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.
హమాస్ స్వాధీనంలో ఉన్న ఆరుగురు ఇజ్రాయెల్ బందీలు హతమయ్యారు. దీంతో ఇజ్రాయెల్‌లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా వ్యప్తంగా నిరసనలు చోటుచేసుకుంటున్నాయి. ఎయిర్‌పోర్టులు, ఆస్పత్రులు, బ్యాంకుల్లో సిబ్బంది సమ్మె చేస్తున్నారు. కాల్పులు విరమణకు ప్రధాని నెతన్యాహు ఒప్పుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
PM Modi's US Tour: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ లభిస్తుంది. అమెరికాలో సెప్టెంబర్ 22వ తేదీన ‘మోడీ & యూఎస్ ప్రోగ్రెస్ టు గెదర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
Modi-Biden telephonic call: రెండేళ్ల నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. సంక్షోభాన్ని దౌత్యం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మరోసారి ప్రధాని పునరుద్ఘాటించారు.