అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వయసు రీత్యా ఏం చేస్తున్నారో.. ఏ మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. ఇప్పటికే పలుమార్లు ఆయన తీరు విమర్శల పాలైంది. తాజాగా ఆఫ్రికా పర్యటనలో కూడా జో బైడెన్ తీరు విమర్శల పాలైంది. సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Rahul Gandhi: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. జో బైడెన్, ప్రధాని నరేంద్రమోడీని రాహుల్ గాంధీ ఎగతాళి చేయడాన్ని దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. అమెరికాతో భారత్‌కి ఉన్న బంధాలకు అనుగుణంగా ఆయన వ్యాఖ్యలు లేవని చెప్పింది. శుక్రవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియాతో మాట్లాడారు.
Zelensky: రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే తాజాగా కీవ్‌పై మాస్కో ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. దీనిపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ చేసిన పోస్ట్‌లో.. ఈ దాడిపై ప్రపంచ దేశాలు స్పందించాలని కోరారు.
Gautam Adani: గౌతమ్ అదానీపై మరోసారి అమెరికా ఆరోపణలు చేసింది. విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి నాలుగు రాష్ట్రాల్లోని అధికారులకు లంచం ఇచ్చారని అభియోగాలు ఎదుర్కొంటోంది.
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య రోజురోజుకు యుద్ధ తీవ్రత పెరిగిపోతుంది. తమ దేశంపైకి దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్‌కు అమెరికా పర్మిషన్ ఇవ్వడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కోపం తెప్పించింది. దీంతో ఆయన అణ్వస్త్ర వినియోగానికి సంబంధించిన ఫైల్ మీద సంతకం పెట్టినట్లు సమాచారం.
Ukraine War: ఉక్రెయిన్, రష్యాల మధ్య మరింత ఉద్రిక్తలు పెంచేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం తీసుకున్నాడు. రష్యాలోని సుదూర లక్ష్యలను కొట్టేలా, సుదూర క్షిపణులను ఉపయోగించుకునేందు జో బైడెన్ ఉక్రెయిన్‌కి అనుమతి ఇచ్చారు. ఈ పరిణామం ఉక్రెయిన్ యుద్ధంలో సంఘర్షణ స్థాయిని పెంచింది.
జీ20 సమ్మిట్ తర్వాత సంప్రదాయంగా ప్రపంచ దేశాధినేతలు దిగే ఫోటోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో, ఇటలీ ప్రధాని జార్జియా మెలొనీలు కనిపించకపోవడం చర్చనీయాంశమైంది.
కమలా హారిస్ ఓటమిపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ రియాక్ట్ అయ్యారు. హారిస్ తన పోరాటాన్ని కొనసాగిస్తుంది.. అసాధారణ పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థిగా వచ్చి చరిత్రాత్మకమైన ప్రచారానికి నాయకత్వం వహించారని పొగిడారు.
US Elections Results: హోరా హోరీగా కొనసాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితాలు వచ్చేశాయి. ఒకవైపు కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే.. కెంటకీ, ఇండియానా, జార్జియా, సౌత్ కరోలినా, వెస్ట్ వర్జీనియా, మిసిసిపి, టెక్సాస్, ఓక్లహామా, ఫ్లోరిడా రాష్ట్రాల్లో ట్రంప్ గెలిచారు.
Donald Trump: బంగ్లాదేశ్‌లో మరోసారి హిందువులపై జరిగిన దాడిని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే భారత్‌తో అమెరికా సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తామన్నారు.