కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనానే అని పలు దేశాలు నిందించిన సంగతి తెలిసింది. ఈ మహమ్మారి చైనా ల్యాబ్ నుంచి లీక్ అయ్యిందంటూ పలు వార్తలు వెలుగులోకి వచ్చాయి.
Joe Biden : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి విమానం ఎక్కబోయి మెట్లపై నుంచి జారిపడిపోబోయారు. ఉక్రెయిన్, పోలాండ్ పర్యటన ముగించుకుని బైడెన్ అమెరికాకు తిరిగి పయనమయ్యారు.
ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ చీఫ్ డేవిడ్ మాల్‌పాస్ ముందస్తుగా పదవీ విరమణ చేయబోతున్నట్లు ప్రకటించిన తర్వాత, ప్రపంచ బ్యాంక్‌కు నాయకత్వం వహించేందుకు మాజీ మాస్టర్‌కార్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అజయ్ బంగాను వాషింగ్టన్ నామినేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ గురువారం తెలిపారు.
Joe Biden: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపధ్యంలో సోమవారం అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పర్యటించారు. అధ్యక్షుడు జెలన్ స్కీతో సమావేశం అయ్యారు. ఉక్రెయిన్ కు అమెరికా మద్దతు ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. అయితే దీనిపై రష్యా మండిపడింది. యుద్ధానికి కారణం పాశ్చత్య దేశాలే అని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ స్వార్థానికి ఉక్రెయిన్, రష్యాలను బలిపశువు చేశారంటూ మండిపడ్డారు. ఈ నేపధ్యంలో రష్యా, అమెరికాల మధ్య చివరిసారిగా కుదిరిన…
Air India order support US jobs: ఇప్పుడు.. సీన్ రివర్స్ అయింది. మనోళ్లకు అమెరికా ఉద్యోగాలివ్వటం కాదు. అమెరికన్లకే మనం ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరుకున్నాం. వినటానికి కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నా.. ఇది నిజం. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడే ఈ మాట అన్నాడు. కొత్త విమానాల కోసం ఎయిరిండియా సంస్థ తమ కంపెనీ బోయింగ్‌కి భారీ ఆర్డర్ ఇవ్వటం వల్ల యూఎస్‌లో ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందని ఆ దేశ ప్రెసిడెంట్ జో బైడెన్ అన్నారు.
Joe Biden: రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ఏడాది కావస్తోంది. కాగా, సోమవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ లో ఆకస్మికంగా పర్యటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీలో చర్చలు జరిపారు. సామ్రాజ్యాన్ని నిర్మించాలనుకునే నియంత ఎప్పటికీ ప్రజల స్వేచ్ఛను తగ్గించలేదని, ఉక్రెయిన్ పై రష్యా ఎప్పటికీ విజయం సాధించలేదని అన్నారు. ఉక్రెయిన్ పర్యటన ముగిసిన తర్వాత పోలాండ్ వచ్చిన బైడెన్ అక్కడి ప్రజలు, ఉక్రెయిన్ శరణార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
ఉక్రెయిన్‌పై దాడికి ఏడాది కావొస్తున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. అణ్వాయుధ వినియోగంపై పరిమితి విధిస్తూ అగ్రరాజ్యంతో చేసుకున్న ఒప్పందంలో రష్యా భాగస్వామ్యాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.
Biden's top secret visit to Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది కాలం గడుస్తోంది. ఇప్పటికీ రెండు దేశాల మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ లో చలి కాలం ముగింపుకు రావడంతో రానున్న కాలంలో రష్యా మరింతగా దాడులకు పాల్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అత్యంత రహస్యంగా ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనపై ఇటు అధికారులకు కానీ అటు మీడియాకు కానీ ముందస్తు…