ఓ యువకుడు అమెరికా అధ్యక్షడు జో బైడెన్‌ని హత్య చేయాలని భారత సంతతి యువకుడు చేసిన యత్నం తీవ్ర కలకలం రేపింది. ఆ యువకుడు వైట్‌హౌస్ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టాడు.
జీ 7 సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అక్కడకి వెళ్లారు. అయితే, ఆయన జపాన్‌లో లాండయ్యే సమయానికే ఆ ప్రాంతంలో వర్షం కురుస్తుంది. యూఎస్ఏ ప్రెసిడెంట్ జో బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి మెట్లు దిగుతూ చినుకులు పడుతున్న కారణంగా ఆయన చేతిలో ఉన్న గొడుగుని తెరిచేందుకు ప్రయత్నిస్తాడు.. కానీ అది ససేమిరా అన్నట్లు తెరుచుకోదు. చివరకు దాన్ని అలానే చేతిలో పట్టుకుని కిందకు దిగాడు.
PM Modi: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీకి అభిమానిగా మారారు. జపాన్‌లో జరుగుతున్న జి-7 సమ్మిట్‌లో భాగంగా క్వాడ్ సమావేశంలో జో బిడెన్ ప్రధాని మోడీని అడిగి మరీ ఆటోగ్రాఫ్ తీసుకున్నారట. క్వాడ్ మీటింగ్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బిడెన్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. ఆటోగ్రాఫ్ తీసుకోవాలని కోరారు.
దేశీయ సమస్యల కారణంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పర్యటనను వాయిదా వేసుకోవడంతో వచ్చే వారం సిడ్నీలో జరగాల్సిన క్వాడ్ సమ్మిట్‌ను ఆస్ట్రేలియా బుధవారం రద్దు చేసింది.
Recession: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆర్థికవేత్తలు ఈ ఏడాది ఆర్థికమాంద్యం తప్పదని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి యూరోపియన్ దేశాలు కూడా ఆర్థికమాంద్యాన్ని ఏదుర్కొవాల్సిందే అని చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా ఫెడరల్ బ్యాంక్ ద్రవ్యోల్భణం, ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు వడ్డీరేట్లను పెంచుతోంది. ఇక బ్రిటన్ వ్యాప్తంగా నిత్యావసరాల ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ట్రెజరీ మాంద్యం గురించి హెచ్చరించింది.
BREAKING NEWS: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు తెలిసింది. జూన్ 22న ప్రధాని అమెరికా పర్యటకు వెళ్తారని, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చే విందులో పాల్గొంటారని వైట్ హౌజ్ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోడీ పర్యటన అమెరికా, భారతదేశం మధ్య స్నేహబంధం మరింత పెరుగుతుందని, భారతీయులు, అమెరికన్ల స్నేహాన్ని ధృవీకరిస్తుందని వైట్ హౌజ్ ఓ ప్రకటనలో పేర్కొంది.
Joe Biden: అమెరికా ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. 2024 ఎన్నికల కోసం డెమెక్రాట్ల తరుపున మరోసారి జో బైడెన్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఇదిలా ఉంటే రిపబ్లికన్ల తరుపును మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జో బైడెన్ మరోసారి విపక్షాలకు టార్గెట్ అయ్యారు. గతంలో కొన్ని సందర్భాల్లో జో బైడెన్ తడబడటం, మనుషుల్ని పోల్చుకోకపోవడం వంటి సంఘటనలతో వార్తల్లో నిలిచారు.