PM Modi: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీకి అభిమానిగా మారారు. జపాన్‌లో జరుగుతున్న జి-7 సమ్మిట్‌లో భాగంగా క్వాడ్ సమావేశంలో జో బిడెన్ ప్రధాని మోడీని అడిగి మరీ ఆటోగ్రాఫ్ తీసుకున్నారట. క్వాడ్ మీటింగ్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బిడెన్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. ఆటోగ్రాఫ్ తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బిడెన్ మాట్లాడుతూ.. ‘ప్రధాని మోడీ కార్యక్రమానికి సంబంధించి దేశంలోని ప్రభావవంతమైన వ్యక్తుల నుండి చాలా అభ్యర్థనలు వచ్చాయి. మీరు అమెరికాలో చాలా పాపులర్. నేను మీ ఆటోగ్రాఫ్ పొందాలనుకుంటున్నాను’. అదే సమయంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా పీఎం మోడీని ప్రశంసించారు. సిడ్నీలో ఆయన కార్యక్రమానికి హాల్ చాలా చిన్నదన్నారు. కమ్యూనిటీ రిసెప్షన్ హాల్ సామర్థ్యం 20 వేల మందికే సరిపోతుంది. హాజరు కావాలనుకున్న ప్రజల కోరికను నెరవేర్చలేకపోయాం అన్నారు.
Read Also:Rs.2000 Note: స్వాతంత్య్రం రాకుముందు రూ.10వేల నోట్లు కూడా నడిచాయా ?
G-7 సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను కూడా కలిశారు. ప్రధాని మోదీ కూడా బ్రిటన్ ప్రధానితో ఒంటరిగా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఇరుదేశాల నేతలు భారత్-యుకె ఎఫ్‌టిఎ చర్చల పురోగతిపై చర్చించడంతో పాటు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షించారు. పెట్టుబడులు, సైన్స్, టెక్నాలజీ, ఉన్నత విద్య వంటి వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరు దేశాల నేతలు అంగీకరించారు. సమావేశానికి సంబంధించి.. సునాక్‌తో తన సమావేశం చాలా బాగుందని ప్రధాని మోదీ అన్నారు. వాణిజ్యం, సృజనాత్మకత, సైన్స్ ఇతర రంగాలలో సహకారాన్ని పెంచుకోవడం గురించి చర్చింనట్లు సమాచారం. ఈ క్వాడ్ సమావేశంలో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ పాల్గొంటున్నాయి.
Read Also:Cyber Crime: రెచ్చిపోతోన్న సైబర్ నేరగాళ్లు.. లక్షలు లాగేస్తున్నారు..!