G20 Summit: వచ్చే నెలలో జరగబోతున్న జీ20 సమావేశాలకు భారత్ వేదిక కాబోతోంది. జీ20 దేశాధినేతలు ఇండియా రాబోతున్నారు. ఈ క్రమంలో వారిందరికి ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ ఎదురుచూస్తోంది.
అమెరికా నేవీకి నూతన అధిపతిగా లీసా ఫ్రాంచెట్టి పేరు తెరపైకి వచ్చింది. దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆ పేరును ప్రతిపాదించారు. ఒకవేళ యూఎస్ సెనేట్ ఆ ప్రతిపాదనను సమర్ధిస్తే అడ్మిరల్ లీసా ఫ్రాంచెట్టి అమెరికా నావికా దళాధిపతిగా బాధ్యతలు స్వీకరించనుంది.
అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్‌పై రిపబ్లికన్లు అభిశంసన తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారు. అంతర్జాతీయ లంచం కేసులో అతని ప్రమేయాన్ని వివరించే ఎఫ్‌బిఐ పత్రాలు బయటకు వచ్చిన నేపధ్యంలో బైడెన్‌పై అభిశంసనానికి రెడీ అయ్యారు.
ప్రిగోజిన్‌పై అమెరికా అధ్యక్షులు జొ బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనపై విష ప్రయోగం జరిగే అవకాశం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాగ్నర్ బాస్ ప్రిగోజిన్ ఇటీవల.. రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటు చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
USA: మూడు దశాబ్దాల నాటి రసాయన ఆయుధాల కన్వెన్షన్ ప్రకారం అమెరికా తన దశాబ్దాల నాటి రసాయన ఆయుధాల నిల్వలను పూర్తిగా ధ్వంసం చేసిందని అధ్యక్షుడు జో బిడెన్ శుక్రవారం ప్రకటించారు. అమెరికా తన చివరి రసాయన ఆయుధాలను సురక్షితంగా ధ్వంసం చేసినందుకు గర్వపడుతున్నానని.. రసాయన ఆయుధాలు భయం లేని ప్రపంచానికి మమ్మల్ని ఒక అడుగు దగ్గర చేసిందని బైడెన్ చెప్పారు.
White House: అమెరికా అధ్యక్ష భవనంలో వైట్‌హౌజ్‌లో అనుమానాస్పదంగా వైట్ పౌడర్ వెలుగులోకి వచ్చింది. వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ ఆదివారం సాయంత్రం వైట్ హౌస్ వద్ద అనుమానాస్పద పదార్థాన్ని కనుగొంది.
PM Modi US Visit: ప్రధాని నరేంద్ర మోడీ నాలుగు రోజుల అమెరికా పర్యటనకు నేడు చివరి రోజు. ఈరోజు వాషింగ్టన్ డీసీలో భారత, అమెరికా వ్యాపారవేత్తలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు.