Womens Day: ఆడాళ్ళూ మీకు జోహార్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు మహిళా దినోత్సవం. నిజం చెప్పాలంటే ఏదో ఒక రోజు కాదు. ప్రతి రోజు స్త్రీమూర్తులదే. తల్లిగా, అక్కగా, చెల్లిగా, భార్యగా మమతానురాగాలు పంచే స్త్రీమూర్తికి ప్రతిరోజూ మహిళా దినోత్సవమే. మాతృదేవోభవ,పితృదేవోభవ,ఆచార్యదేవోభవ,అతిధిదేవోభవ అని “స్త్రీ”ని ఉపనిషత్తులో అందరికంటే అగ్రపూజ అందవలసిన మాతృమూర్తిగా అభివర్ణించారు.స్త్రీ అను పదములో ‘స’కార, ‘త’కార, ‘ర’కారములున్నాయి. ‘ స’ కారము సత్వగుణానికి,’త’ కారము తమోగుణానికి, ‘ర’ కారము రజోగుణానికి ప్రతీకలుగా మన పెద్దలు చెబుతారు. ప్రకృతికి ప్రతీకగా స్త్రీని చెబుతారు.

నేడు స్త్రీలు పురుషులతో సమానంగా… రాజకీయం, విద్యారంగం, శాస్త్రసాంకేతిక రంగం… ఒక్కో సందర్భంలో అంతకుమించి అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. ఋగ్వేదం అనేది పురుషునికి మరియి ఈ సభ్యసమాజానికి సూర్యకాంతి(ఉషస్సు) వంటిది అని స్త్రీలు తమ విద్యాశోభతో గృహాన్ని అనుకూలంగా తీర్చి దిద్దే శక్తి కేవలం స్త్రీకే సాధ్యపడుతుంది. స్త్రీ భావితరాలకు శిక్షణ,రక్షణగా నిలుస్తుందని తెలియజేసింది. వేదాల తర్వాత అంతంటి మహోన్నతమైనది మనుస్మృతి కూడా మహిళలకు మహోన్నత స్థానం ఇచ్చింది.
Also Read
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
వేదకాలం నుండి స్త్రీని అత్యధికంగా గౌరవిస్తూనే స్త్రీ రక్షణ కొరకు అనుక్షణం ఆరాటపడుతూనే ఉంది.యవత్ సమాజంలో నేటికి కొనసాగుతూనే ఉంది. మహాత్మాగాంధీ కూడా ఈ మాటే అన్నాడు స్త్రీకి రక్షణ ఉంటే లోకానికే రక్షణ కలుగుతుందని చెప్పాడు.స్త్రీ తాను మరణయాతనను పొంది మరోజన్మనెత్తి జాతి మొత్తాన్ని కని పాలిచ్చి పెంచి,సకల సేవలనందిస్తూ,సృష్టిని సుస్థిరం చేస్తున్న మహోన్నత మూర్తి స్త్రీ. స్త్రీ సహకారం లేనిదే పురుషుడికి మనుగడే లేదు,జీవితమే లేదు అన్న సత్యాన్ని గ్రహించి అంతటి మహోన్నతమైన స్త్రీ మూర్తిని గౌరవిద్దాం. మహిళలు, విద్యార్ధినులు, చిరుప్రాయంలో వున్నవారిని కూడా కామాంధులు వదలడం లేదు. ఎన్ని చట్టాలు వచ్చినా వారికి తగిన విధంగా శిక్షలు పడడం లేదు. యత్రనార్యన్తు పూజ్యంతే-రమంతే తత్ర దేవతా: ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువుదీరి ఉంటారు. స్త్రీ మూర్తులందరికీ NTV మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతోంది.
తాజావార్తలు
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!