Jeedimetla Accident: మద్యం మత్తు.. అతివేగం, అజాగ్రత్త.. పలువురి ప్రాణాలను తీస్తోంది.. కొందరి వికృత చేష్టలతో అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయి.. తాజాగా.. హైస్పీడ్ తో వస్తున్న కారు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని గాజులరామారంలో చోటుచేసుకుంది.
Read also: Shamshabad Airport: వాట్ ఏ ఐడియా సార్ జీ.. బూట్ లో కోటి విలువైన విదేశీ బంగారం..
గాజులరామారం వద్ద బాషా గోపి అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. డ్యూటీ ముగించుకుని రోడ్డు పక్కన నడుచుకుంటూ వస్తున్నాడు. అయితే గాజులరామారం వద్ద క్రాసింగ్ లో ఇటు నుంచి ఒక బైక్ వెళుతున్న క్రమంలో అటు నుంచి హై స్పీడ్ లో కారు దూసుకు వచ్చింది. అయితే బైక్ ను తప్పించబోయి.. ఎదురుగా వున్న సెక్యూరిటీ గార్డు గోపిని బలంగా ఢీకొట్టింది. అంతే గోపి ఒక్కసారిగా పైకి లేచి అవతల పడ్డాడు. కారు బలంగా ఢీ కొట్టడంతో గోపీ స్పాట్ లోనే చనిపోయాడు. అయితే కారులో వున్న వ్యక్తులు మెల్లగా ఏమీ తెలియనట్లు ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వచ్చి ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. అయితే డ్రైవింగ్ చేసిన వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
Read also: Seetharama Project: సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు..
హుటా హుటిన ఘటన వద్దకు చేరుకున్న పోలీసులు కారు డ్రైవింగ్ చేసిన వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. కారులో వున్న ఐదు మంది పరారీలో వున్నట్లు తెలుస్తుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో వున్న వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. టనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దాని అధారంగా పరారీలో వున్న ఐదుగురిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. మృతుడు బాషా గోపి తండ్రి నర్సింలు కొద్ది రోజుల క్రితం మరణించాడు. అయితే గోపీ తన కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. తండ్రి లేని కుటుంబంలో పెద్ద దిక్కుగా వున్న కొడుకు గోపి కూడా మృతి చెందడంతో కుటుంబం విషాధ ఛాయలు అలుముకున్నాయి. తాగి డ్రైవ్ చేస్తున్న యువకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Pigeon Droppings: పావురంతో ప్రాణాంతక వ్యాధులు.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..