JEE Main: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ ఫైనల్ పరీక్ష నిర్వహణకు ఎన్టీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 4, 5, 6, 8, 9, 12 తేదీల్లో ప్రధాన కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
జేఈఈ (JEE) కారణంగా మరో విద్యాకుసుమం నేలరాలిపోయింది. సారీ నాన్నా... నేను జేఈఈ చేయలేను అంటూ తనువు చాలించాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ (Rajasthan) కోటాలో చోటుచేసుకుంది.
23 students scored 100 NTA score in session 1: దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2024 సెషన్-1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మంగళవారం విడుదల చేసింది. పేపర్ -1 (బీఈ/బీటెక్) ఫలితాల్లో దేశవ్యాప్తంగా 23 మంది విద్యార్థులు 100 శాతం స్కోరు సాధించారు. ఈ 23 మందిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 10 విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ నుంచి…
NTA announced the JEE Main 2024 Results: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2024 సెషన్-1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మంగళవారం ఉదయం విడుదల చేసింది. జేఈఈ మెయిన్స్ అధికారిక వెబ్‌సైట్ (jeemain.nta.nic.in)లో విద్యార్థులు తమ స్కోర్ కార్డును చూసుకోవచ్చు. అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ లేదా పాస్‌వర్డ్ ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం పర్సంటైళ్లతో పాటు మొత్తం జేఈఈ మెయిన్ పర్సంటైల్ కూడా…
Kota: రాజస్థాన్ కోటాలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఒత్తిడితో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. అక్కడి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడటం లేదు. కోటాలో 18 ఏళ్ల జేఈఈ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లిదండ్రులను ఉద్దేశించి సూసైడ్ నోట్ రాసింది. పరీక్షకు రెండు రోజుల ముందు ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కోటాలో వారం రోజుల్లో ఇది రెండో ఆత్మహత్య.
JEE Mains 2024 Exams: దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో నిర్వహించే జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు నేటి నుంచి జరగనున్నాయి. పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు.. జనవరి 24, 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరుగుతాయి. జనవరి 24న పేపర్-2 పరీక్ష నిర్వహిస్తుండగా.. జనవరి 27, 29, 30, 31 తేదీల్లో పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల…
JEE Main 2024 Registration Last Date: జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ తొలి విడత దరఖాస్తు గడువును జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) పొడిగించింది. తొలి విడతకు దరఖాస్తు చేసే గడువును డిసెంబరు 4 (రాత్రి 9 గంటల) వరకు పొడిగించింది. ముందుగా ప్రకటించిన గడువు గురువారం (నవంబర్ 30) రాత్రితో ముగియగా.. దాన్ని డిసెంబరు 4వ తేదీ వరకు ఎన్‌టీఏ పొడిగించింది. ఇక సమర్పించిన దరఖాస్తుల్లో ఏవైనా తప్పిదాలు ఉంటే.. వెబ్‌సైట్‌లో డిసెంబరు…
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(జేఈఈ) అడ్వాన్స్ డ్ కు హాజరయ్యే తెలుగు విద్యార్థులకు శుభవార్త. ఇకపై జేఈఈ మెయిన్‌ను తెలుగు రాసుకునేలాగానే.. ఇకపై జేఈఈ అడ్వాన్స్ డ్‌ను కూడా తెలుగులో రాసుకోవడానికి అవకాశం కలగనుంది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీల్లో బీటెక్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్(బీఎస్) సీట్ల భర్తీకి గత నెల 28వ తేదీన నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్–2022 ఫలితాలను పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ ముంబై ఆదివారం ప్రకటించింది.
ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ, మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్‌లను కామన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షతో విలీనం చేసే ఆలోచన లేదని కేంద్ర విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. రాజస్థాన్‌లోని కోట శిక్షణా కేంద్రంలో విద్యార్థులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.