NTA announced the JEE Main 2024 Results: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2024 సెషన్-1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మంగళవారం ఉదయం విడుదల చేసింది. జేఈఈ మెయిన్స్ అధికారిక వెబ్‌సైట్ (jeemain.nta.nic.in)లో విద్యార్థులు తమ స్కోర్ కార్డును చూసుకోవచ్చు. అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ లేదా పాస్‌వర్డ్ ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం పర్సంటైళ్లతో పాటు మొత్తం జేఈఈ మెయిన్ పర్సంటైల్ కూడా విద్యార్థులు తెలుసుకోవచ్చు. తుది కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం మధ్యాహ్నం విడుదల చేసింది. ప్రాథమిక కీ, తుది కీ మధ్య భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. 17 ప్రశ్నలకు కీ మారగా.. గణితంలో 3 ప్రశ్నలు, రసాయనశాస్త్రంలో 3 ప్రశ్నలను తొలగించారు.
Also Read: Gold Price Today: మగువలకు శుభవార్త.. దిగొస్తున్న బంగారం ధరలు!
పేపర్ 1 పరీక్షలు జనవరి 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో నిర్వహించగా.. పేపర్ 2 పరీక్ష జనవరి 24న జరిగింది. ఈ సంవత్సరం మొత్తం 12 లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ యొక్క రెండు పేపర్లకు నమోదు చేసుకున్నారు. అందులో 11.70 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 2.40 లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. ఓ విద్యార్థి జేఈఈ మెయిన్ పరీక్షలను క్లియర్ చేస్తే.. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్వాన్స్‌డ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమవగా.. ఏప్రిల్‌లో పరీక్ష ఉంటుంది.