JEE Mains 2024 Exams: దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో నిర్వహించే జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు నేటి నుంచి జరగనున్నాయి. పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు.. జనవరి 24, 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరుగుతాయి. జనవరి 24న పేపర్-2 పరీక్ష నిర్వహిస్తుండగా.. జనవరి 27, 29, 30, 31 తేదీల్లో పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్ట్.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెకండ్ షిఫ్ట్ ఉంటుంది.
దేశ వ్యాప్తంగా దాదాపు 12.30లక్షల మందికి పైగా విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్షలకు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2.5 లక్షల మందికి పైగా విద్యార్ధులు పరీక్ష రాస్తున్నారు. జేఈఈ మెయిన్ పరీక్షకు గతేడాది కన్నా.. ఈసారి రికార్డు స్థాయిలో ఈసారి దరఖాస్తులు వచ్చాయి. జేఈఈ మెయిన్స్, బీఆర్క్ మొదటి విడత 2024 పరీక్షలకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలి. ఉదయం 8.30, మధ్యాహ్నం 2.30 గంటల వరకు పరీక్ష కేంద్రాల గేట్లు మూసేస్తారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే విద్యార్థి పరీక్ష రాసే చోటు తెలుస్తుంది.
Also Read: Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే?
విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు ఇవే:
# విద్యార్థులు తమ ధ్రువీకరణను తెలిపే ఫొటోతో కూడిన గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఆధార్ / పాస్‌పోర్టు / రేషన్‌కార్డు / ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉండాలి.
# విద్యార్థులు రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, ట్రాన్స్‌పరెంట్ పెన్, అడ్మిట్ కార్డు తప్పనిసరి.
# బీఆర్క్ పరీక్ష అయితే పెన్సిల్, స్కేల్, రబ్బర్, జామెంట్రీ బాక్స్ పరీక్ష హాలులోకి విద్యార్ధులు తీసుకెళ్లాలి.
# పరీక్ష కేంద్రంలో ఇచ్చే రఫ్ షీట్లపైనే కాలిక్యులేషన్సు/రైటింగ్ వర్కు చేయాలి. ఆ తర్వాత వాటిని ఇన్విజిలేటర్‌కు అందజేయాలి.
# దివ్యాంగులైన విద్యార్థులు ఎవరైనా ఉంటే.. వారు తమ వెంట మెడికల్ ఆఫీసర్ ధ్రువీకరించిన సర్టిఫికెట్‌ను తీసుకెళ్లాలి.