వైసీపీ హయంలో జరిగిన ప్రమాదాలను వివరిస్తూ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన కార్యాలయంలో ఫ్లెక్సీ వేశారు. ‘రాబందుల ముఠా.. ఇదిగో జగనాసుర రక్తచరిత్ర’ అంటూ ప్రమాద ఘటనలకు సంబంధించిన వివరాలను వివరించారు. ప్రభాకర్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ తిరుమల తొక్కిసలాటపై వైసీపీ శవ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. తిరుమల టికెట్ల టోకెన్లు అమ్ముకుని మాజీ మంత్రి ఆర్కే రోజా బెంజ్ కారు తెచ్చుకుందని విమర్శించారు. నోరుంది కదా అని…
టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎట్టకేలకు దిగొచ్చారు. సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లతకు ఆయన క్షమాపణలు చెప్పారు. ‘సినీ నటి మాధవీ లత గురించి ఆవేశంలో అలా మాట్లాడటం తప్పే. ఆమెకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నాను. 72 సంవత్సరాల వయసున్న నేను ఆవేశంలో అలా మాట్లాడానే తప్ప.. కించపరచాలనే ఉద్దేశం లేదు’ అని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇక జేసీ, మాధవీ లత మధ్య వివాదంకు తెరపడనుంది.…
Off The Record: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు నుంచి వృధాగా పోయే ఫ్లైయాష్.. రెండు పార్టీల మధ్య వైరానికి దారి తీసింది. ఆ రెండు కుటుంబాలు ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నవే. కాంట్రాక్ట్ పనుల విషయంలో ఒకరిపై ఒకరు కాలు దువ్వుకుంటున్నారు. ఎంతవరకైనా వెళ్తాం.. తగ్గేదేలే అంటోంది జేసీ వర్గం. మా ప్రాంతంలోకి ఎలా అడుగుపెడతావో చూస్తామంటూ.. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు పొలిటికల్ హీట్ పెంచారు. సీఎం చంద్రబాబు హెచ్చరించినా ఇరువురు నేతలు తగ్గలేదు. చివరకు…
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి.. బీజేపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. అయితే, జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి సత్య కుమార్ యాదవ్.. కౌంటర్ ఎటాక్‌కు దిగారు.. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు అని ఎద్దేవా చేసిన ఆయన.. అంత తీవ్రంగా మాట్లాడాల్సిన అవసరం లేదని సూచించారు.. అయితే, ప్రభాకర్ రెడ్డి వయసుకు తగినట్లుగా మాట్లాడాలని పేర్కొన్నారు..
తాడిపత్రిలో జరిగిన నూతన సంవత్సర వేడుకలు రాజకీయ రచ్చగా మారాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు మాత్రమే అంటూ నిర్వహించిన వేడుకలప్తె బీజేపీకి చెందిన యామిని శర్మ, మాధవీ లతలు చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. ఈ ఇద్దరు మహిళా నాయకులప్తె జేసీ వర్గీయులు విరుచుకుపడ్డారు. నియోజకవర్గ ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడారంటూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో టీడీపీ కౌన్సీలర్లు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో జేసీ ట్రావెల్స్‌కు సంబంధించి బస్సు దగ్థం…
జేసీ దివాకర్ ట్రావెల్స్ బస్సు దగ్ధం కీలక మలుపులు తిరుగుతోంది. బస్సు దగ్ధమైన ఘటన ప్తె ఒకవైపు పోలీసుల విచారణ చేస్తుండగా, అసలు ఘటనపై ఫిర్యాదు చేయనని జెసి చెబుతున్నారు. బస్సు దగ్ధం ఘటనప్తె సుమోటోగా కేసు నమోదు చేసుకోవాలంటున్నారు. 300 బస్సులు పోతేనే ఏడ్చలేదని ఇప్పుడు ఎందుకు భాదపడతానన్నారు ఆయన మరో వ్తెపు తాడిపత్రిలో డిసెంబర్ 31 వేడుకులను నిర్వహణ ప్తె లేనిపోని ఆరోపణలు చేశారని బీజేపీ నేతల ప్తె తీవ్రస్థాయిలో జెసి ఆరోపణలు చేయడం…
బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. న్యూఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తే మీకేంటి సమస్యా? అని ప్రశ్నించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ తనపై లేనిపోని ఆరోపణలు చేశాయన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి.. అనంతపురంలో తన బస్సుల దహనం వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
Jc Prabhakar Reddy: వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళల గురించి మాట్లాడే అర్హత నానికి లేదని తెలిపారు. గతంలో చేసినవి అన్ని మార్చిపోయారా.. జేసీ కుటుంబం మీద కేసులు పెట్టినప్పుడు కుటుంబం కనబడలేదు.. అసలు విక్టోరియా ఎవరూ.. అర్థరాత్రి సమయంలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు కుటుంబం కనపించలేదా అని మండిపడ్డారు.
జెసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు కోరాడు.. నమ్మశక్యం కావడం లేదు.. కానీ ఇదీ నిజం... ప్రత్యర్థులైనా.. అధికారుపై అయినా గుడ్లు ఉరిమి చూస్తూ భయపెట్టే జేపీ.. క్షమాపణాలు చెబుతూ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది... దీంతో, ఫ్లైయాష్ వివాదంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి జేసీ ప్రభాకర్ రెడ్జి క్షమాపణలు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది..
వాళ్ళు ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డాం.... మనం పవర్లోకి వచ్చాకా... ఇబ్బందులు పడుతున్నాం. ఇక బతుకంతా ఇంతేనా? కొట్లాడుతూనే ఉండాల్నా? ఇంకెన్నాళ్ళిలా పోరాటం.... అంటూ తెగ ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారట ఆ మాజీ ఎమ్మెల్యే. ఏదేమైనా సరే... వెనక్కి తగ్గేదే లేదు. ప్రైవేట్ కేసులు వేసైనా సరే... నేను అనుకున్నది సాధిస్తానంటున్న ఆ లీడర్ ఎవరు? ఆయన అసహనానికి కారణం ఏంటి?