కేతిరెడ్డి పెద్దారెడ్డి దమ్ముంటే తాడిపత్రికి రా... తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీపై స్పందించిన జేసీ... కేతిరెడ్డి పెద్దారెడ్డిపై నాకు ఎలాంటి కక్ష లేదు.. కానీ, కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన దౌర్జన్యాలపై తాడిపత్రి ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు..
Kethireddy Pedda Reddy: అనంతపురం జిల్లా రాజకీయాల్లో కీలక నాయకుడిగా పేరుగాంచిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రస్తుతం వివాదాస్పద పరిణామాల నడుమ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంతో పెద్దారెడ్డి మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సారి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ, సోమవారం ఉదయం 10 గంటలకు స్వయంగా పోలీసులే ఆయనను తాడిపత్రికి తీసుకెళ్లాలని తెలిపింది. Infinix HOT 60i 5G: 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ ఉన్న ఫోన్…
తాడిపత్రిలో టీడీపీ నేత, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. అయితే, ఈ రోజు మీడియాతో మాట్లాడిన పెద్దారెడ్డి.. నేను జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమ అక్కను ఎక్కడైనా తిట్టినట్లు, దూషించినట్లు ఆమె చెబితే.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన భార్యకు క్షమాపణలు చెబుతానని వ్యాఖ్యానించారు..
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ తీరుతో అధికార పార్టీ నేతలు కూడా తలలు పట్టుకుంటున్నారా? ఎంతటి అధికారి అయినాసరే… అదేదో తమ ఇంట్లో పాలేరన్నట్టుగా ఛైర్మన్ ఫీలైపోతున్నారా? జిల్లా స్థాయి అధికారుల మీదికి సైతం ఒంటికాలి మీద లేస్తూ… బూతు పురాణం అందుకోవడాన్ని ఎలా చూడాలి? ఓవైపు రచ్చ అవుతున్నా… అంతా జనం కోసమేనని ప్రభాకర్‌రెడ్డి చెప్పడం దేనికి సంకేతం? ఓపెన్ విత్ స్పాట్ జేసీ అధికారుల మీద ఫైర్ అవుతున్నది ఇదే… ఈ వైఖరే… ఇప్పుడు కేవలం…
నేను రౌడీనే.. అందుకే నా ఊరు బాగుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అందరూ మున్సిపల్ ఎన్నికలలో ఓడిపోతే.. నన్ను ఒక్కడినే గెలిపించారని గుర్తుచేశారు జేసీ.. ఇక, తాడిపత్రి ప్రజలు నాకు దేవుళ్లు.. వాళ్ల కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అన్నారు..
తాడిపత్రిలో వైసీపీ మీటింగ్‌లో వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు.. అనంతపురంలో డంపింగ్ యార్డును తీసేసేందుకు రూ. 24 కోట్లు ఖర్చుపెట్టారని.. తాడిపత్రిలో డంపింగ్ యార్డ్ కు పది కోట్లు ఇచ్చారన్నారు.. కానీ ఒక్క రూపాయి కూడా వాడలేదని తెలిపారు. వైసీపీ నాయకులు మీటింగ్ తర్వాత చెత్తను ఎక్కడంటే అక్కడ పడేసి వెళ్లారన్నారు. రోడ్డుపైన వెళుతుంటే చెత్త దుర్వాసన వస్తుందని యాక్సిస్ బ్యాంకు వాళ్లు కంప్లైంట్ చేశారని చెప్పారు. మున్సిపాలిటీ…
వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీర్ కాదు అని మండిపడ్డారు. తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులను అడ్డుకుంటామంటే ఊరుకోము.. తాడిపత్రిలో ఎవరు ఉండాలో.. ఎవరు ఉండకూడదో ప్రభుత్వానికి జీవో జారీ చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి గడపకు తీసుకెళ్లి బలోపేతం చేస్తామన్నారు.
JC Prabhakar Reddy: రప్పా రప్పా, రాత్రిపూట కన్ను ఎగిరేస్తే ఎలా ఉంటుందో నీకు (బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి) తెలుస్తుంది అని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. మీలాంటి భాష మేము మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు.. నీకంటే బండ బూతులు మాట్లాడడం నాకు వస్తుంది.
ఏపీలో డైలాగ్ వార్ పీక్స్‌కు చేరుతోంది. సినిమా డైలాగ్స్ కన్నా... పొలిటికల్ స్క్రీన్ మీద పంచ్‌లు పేలిపోతున్నాయి. కొన్ని హాట్ టాపిక్ అవుతుంటే... మరికొన్ని తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. పుష్ప 2 సినిమాలోని రప్ప రప్ప డైలాగ్ చుట్టూ రాజకీయ అగ్గి రగులుకుంటోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ పల్నాడు టూర్లో మొదలైన డైలాగ్ వివాదం...
JC Prabhakar Reddy: రప్పా రప్పా అనే డైలాగ్ తాడిపత్రి పట్టణానికి పాకింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట తిరగొద్దంటూ వైసీపీ కార్యకర్తలకు ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రి పట్టణానికి దొంగ చాటున వచ్చాడు కేతిరెడ్డి.. అయితే, నాకు వైఎస్ఆర్ పార్టీ శత్రువు కాదు మా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే అన్నారు.