BJP vs JC: టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి.. బీజేపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. అయితే, జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి సత్య కుమార్ యాదవ్.. కౌంటర్ ఎటాక్‌కు దిగారు.. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు అని ఎద్దేవా చేసిన ఆయన.. అంత తీవ్రంగా మాట్లాడాల్సిన అవసరం లేదని సూచించారు.. అయితే, ప్రభాకర్ రెడ్డి వయసుకు తగినట్లుగా మాట్లాడాలని పేర్కొన్నారు.. ఎక్కడో బస్సు కాలిస్తే బీజేపీకి ఏం సంబంధం..? అని నిలదీశారు.. బీజేపీ దేశవ్యాప్తంగా పరిపాలిస్తున్న పార్టీ.. గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సులపై, వ్యాపారాలపై, అనేక ఆరోపణలు ఉన్నాయి, వాటి గురించి నేను మాట్లాడబోన్నారు.. కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ గురించి ఇలా మాట్లాడకూడదు అని హితవు చెప్పారు.. వ్యక్తిగత సమస్యలు తీసుకువచ్చి, రాష్ట్ర సమస్యలాగా మాట్లాడకూడదు.. అర్థంపర్థం లేని విమర్శలు, బీజేపీ మీద చేయడం సరికాదన్నారు..
Read Also: HMPV Virus: చైనాలో విజృంభిస్తున్న కొత్త వైరస్.. లక్షణాలు, ఎవరికి ఎక్కువ ప్రమాదం..?
జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఎవరికైనా మాటల్లో కంట్రోల్ ఉండాలన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. అంతేకాదు వైఎస్ జగన్ పై ప్రేమ ఉంటే ఆయన దగ్గరకు వెళ్లవచ్చు అంటూ సలహా ఇచ్చారు.. ఎప్పుడు కాంట్రవర్సీ జేసీ ప్రభాకర్ రెడ్డి కోరుకుంటారని దుయ్యబట్టారు.. మాధవిలత కేవలం మహిళలు జాగ్రత్తగా ఉండాలని మాత్రమే చెప్పారని గుర్తుచేశారు.. ఎవరు ఏ బట్టలు వేసుకోవాలో జేసీ చెప్తారా..? అని నిలదీశారు.. మాకు వివాదాలు అవసరం లేదు.. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రగతి పథంలో ఉంది.. ఇలాంటి పరిస్థితి మంచిది కాదని సూచించారు మంత్రి సత్యకుమార్ యాదవ్..
Read Also: Delhi Assembly Polls: ఢిల్లీ బీజేపీ చీఫ్ కీలక నిర్ణయం.. పోటీకి దూరంగా వీరేంద్ర సచ్‌దేవా!
కాగా, బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. న్యూఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తే మీకేంటి సమస్యా? అని ప్రశ్నించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ తనపై లేనిపోని ఆరోపణలు చేశాయన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి.. అనంతపురంలో తన బస్సుల దహనం వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా డిసెంబర్ 31 రాత్రి నేను నిర్వహించిన కార్యక్రమాలపై విమర్శలు చేసిన ఆర్ఎస్ఎస్, బీజేపీ, వీహెచ్‌పీ నాయకులపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమం పై విమర్శలు చేసిన ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు థర్డ్ జెండర్ కంటే ఇంకా తగ్గు నాకొడుకులంటూ జేసీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే.