తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి, సినీ నటి మాధవి లత వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అయితే ఈ ఈవెంట్ కు మహిళలు ఎవరు వెళ్లొదంటూ మాధవీ లత ఓ వీడియో రిలీజ్ చేసింది. దాంతో ఆగ్రహించిన జేసీ నటి మాధవిలతనుద్దేసిస్తూ మాధవీ లత ఒక వ్యభిచారి అని, ఆమెను బీజేపీలో ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియడం లేదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ పై విమర్శలు రావడంతో మాధవిలతకు ఆ మధ్య క్షమాపణలు చెప్పారు. ఆవేశంలో మాట్లాడాను అని వివరణ ఇచ్చారు. ఇక ఇక్కడితో ఈ వ్యవహారం సద్దు మణిగింది అని అందరు అనుకున్నారు. కానీ తాజాగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై కేసు నమోదు అయింది. సినీ నటి మాధవి పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఈ కేసు నమోదు చేసారు పోలీసులు.సైబరాబాద్ పోలీసులకు సినీనటి మాధవిలత ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసిన పోలీసులు. సినీనటి మాధవిని ఉద్దేశిస్తూ కొన్నాళ్ల క్రితం అభ్యంతరకర అసభ్యకరమైన దూషణలు చేసారు ప్రభాకర్ రెడ్డి. తనను కించపరుస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేసిన సినీ నటి మాధవిలత.