తాడిపత్రిలో వైసీపీ మీటింగ్‌లో వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు.. అనంతపురంలో డంపింగ్ యార్డును తీసేసేందుకు రూ. 24 కోట్లు ఖర్చుపెట్టారని.. తాడిపత్రిలో డంపింగ్ యార్డ్ కు పది కోట్లు ఇచ్చారన్నారు. కానీ ఒక్క రూపాయి కూడా వాడలేదని తెలిపారు. వైసీపీ నాయకులు మీటింగ్ తర్వాత చెత్తను ఎక్కడంటే అక్కడ పడేసి వెళ్లారన్నారు. రోడ్డుపైన వెళుతుంటే చెత్త దుర్వాసన వస్తుందని యాక్సిస్ బ్యాంకు వాళ్లు కంప్లైంట్ చేశారని చెప్పారు. మున్సిపాలిటీ కార్మికులు స్ట్రైక్ లో ఉన్నారని.. కౌన్సిలర్ తో కలిసి వైసీపీ నేతలు చేసిన చెత్తను బయట పారేశామని వెల్లడించారు.
READ MORE: Nara Lokesh: ఒకటవ తరగతి చిచ్చరపిడుగును మెచ్చుకున్న నారా లోకేష్.. ఇంతకీ ఏం చేసింది..?
“పెద్దారెడ్డిని ఎందుకు వద్దంటున్నామంటే.. ఊరు చెత్తమయం అవుతుందని వద్దన్నాం. తాడిపత్రిలోకి కొత్త నాయకులు వస్తున్నారూ.. వారు రావడం సంతోషంగా ఉంది. వైసీపీ మీటింగ్ కు పెద్దారెడ్డి కోడల్ని పంపిస్తాడని ముందే తెలుసు. అర్జునుడు భీష్మున్ని పంపించినట్లుగా ఉంది. వైసీపీ నాయకులు తాడిపత్రిలోకి రావాలంటే వారిలో మార్పు రావాలి. అనంత వెంకట్రామిరెడ్డీ.. తాడిపత్రి నా జాగిరి కాదు.. కానీ తాడిపత్రిని నా జాగిరి లాగా చూసుకుంటా.. తాడిపత్రి నా జాగిరి కాదు.. ప్రేమతో చూసుకుంటున్న ఊరు.” అని జేసీ ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
READ MORE: CM Revanth Reddy : కేసీఆర్‌కు మేము అన్నం పెడితే మాకు సున్నం పెట్టారు