తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రాజకీయ అనుభవం, నైపుణ్యం బీజేపీకి కీలకంగా మారబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. నాగేంద్రన్ గతంలో అన్నాడీఎంకేలో కీలక నేతగా పనిచేశారు. జయలలిత హయాంలో మంత్రి పదవిని కూడా చేపట్టారు. అయితే ఆమె మరణానంతరం, 2017లో ఆయన అన్నాడీఎంకేను విడిచిపెట్టి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలో సుదీర్ఘంగా పనిచేస్తూ, పార్టీకి మద్దతుగా నిలిచారు.
Rajinikanth : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే 30 ఏళ్ల క్రితం అప్పటి సీఎం జయలలితపై రజినీకాంత్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 1996 తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత మరోసారి సీఎం అయితే తమిళనాడును ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అలా జయలలితను ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు రజినీ. మాజీ మంత్రి వీరప్పన్ విషయంలో తాను…
Jayalalithaa: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలితకు సంబంధించిన ఆస్తులను ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగింత చర్యలు ప్రారంభించారు. బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం ఫిబ్రవరి 14, 15వ తేదీలలో జయలలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించడానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆస్తులలో జయలలితకు చెందిన 1562 ఎకరాల భూమి, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, పది వేలకు పైగా చీరలు, 750కి పైగా జతల చెప్పులు, గడియారాలు, ఇంకా ఇతర విలువైన వస్తువులు కూడా…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై మంత్రి టిఎం అన్బరసన్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఎఐఎడిఎంకె (AIADMK) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల జరిగిన డీఎంకే కార్యక్రమంలో అన్బరసన్ మాట్లాడుతూ.. ఇటీవల రాజకీయ పార్టీని ప్రారంభించిన తమిళ నటుడు తలపతి విజయ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
Annamalai: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై మాజీ సీఎం, దివంగత జయలలితను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ద్రవిడ రాజకీయాలకు కేంద్రంగా ఉన్న తమిళనాడులో జయలలిత ‘‘హిందుత్వ నాయకురాలి’’గా ఉందని అన్నారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై విచారణకు ఏర్పాటైన ఆర్మగస్వామి కమిషన్ తన నివేదినకను ఈ ఏడాది ఆగస్టు 25న సీఎం స్టాలిన్‌కు సమర్పించిన సంగతి విదితమే. కానీ జయలలిత మరణం ఇప్పటికి మిస్టరీనే. తాజాగా దివంగత సీఎం మరణంపై ఆమెకు ఆప్తమిత్రురాలైన వీకే శశికళ కీలక వ్యాఖ్య చేశారు.
VK Sasikala reacts to Arumughaswamy commission’s report: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మరణంపై అరుముగస్వామి కమిషన్ ఆ రాష్ట్రంలో హీట్ పెంచుతోంది. కమిషన్ ఇచ్చిన రిపోర్టు రాజకీయంగా చర్చనీయాంశం అయింది. అయితే కమిషన్ జయలలిత స్నేహితురాలు వీకే శశికళతో పాటు మరో ముగ్గురిపై అనుమానాలు ఉన్నాయనే రిపోర్టును ఆమె వ్యతిరేకించారు. జయలలిత చికిత్సలో తానెప్పుడు కలుగచేసుకోలేదని, ఆమె మరణంలో నా పాత్ర లేదని అన్నారు. తమిళనాడు అసెంబ్లీలో మంగళవారం అరుముగస్వామి రిపోర్టును ప్రవేశపెట్టారు.