Rajinikanth : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే 30 ఏళ్ల క్రితం అప్పటి సీఎం జయలలితపై రజినీకాంత్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 1996 తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత మరోసారి సీఎం అయితే తమిళనాడును ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అలా జయలలితను ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు రజినీ. మాజీ మంత్రి వీరప్పన్ విషయంలో తాను అలా స్పందించానని చెప్పారు. వీరప్పన్ కు నిర్మాతగా ఎంతో పేరు ఉంది. రజినీకాంత్ సూపర్ హిట్ సినిమాలను వీరప్పన్ నిర్మించారు. భాషా సినిమాను చేసింది కూడా ఆయనే. భాషా సినిమా 100 రోజుల ఫంక్షన్ లో రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also : Jaat : జాట్’కి సెన్సార్ కట్లు.. ఏకంగా 22 సీన్లు?
తమిళనాడు రాజకీయాల్లో కుటుంబ వారసత్వం ఎక్కువైందని.. రాష్ట్రం సర్వనాశనం అవుతోందంటూ విమర్శలు గుప్పించారు. అక్కడి నుంచి ఏమైందో రజీనికాంత్ చెప్పారు. ‘నేను అలా కామెంట్లు చేయడం వల్ల అప్పుడు సీఎంగా ఉన్న జయలలిత నా స్నేహితుడు అయిన వీరప్పన్ ను మంత్రి పదవి నుంచి తీసేశారు. ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డాను. తర్వాత రోజు వీరప్పన్ తో మాట్లాడాను. జయలలితతో మాట్లాడి తిరిగి మంత్రి పదవి ఇచ్చేలా చేస్తానన్నాను. కానీ వీరప్పన్ ఒప్పుకోలేదు. తనకు ఏ పదవి వద్దని.. నీ వ్యక్తిత్వం మార్చుకోవద్దని నాకు చెప్పాడు. ఆ బాధతోనే జయలలితపై ఎన్నికల్లో అలాంటి కామెంట్లు చేశాను. అంతే తప్ప ఆమెతో నాకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవు’ అంటూ చెప్పుకొచ్చాడు రజినీకాంత్. ఆ ఎన్నికల్లో జయలలిత ఓడిపోయింది. ఆమె ఓటమికి రజినీ వ్యాఖ్యలు కూడా ఓ కారణమే అని అప్పట్లో పెద్ద చర్చ జరిగింది.