అండమాన్ లో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త వాయుగుండంగా బలపడి తుఫాన్‌గా మారింది. అయితే ఈ తుఫాన్ పేరు జవాద్ తుఫాన్‌గా నామకరణం చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర, ఒడిశాలపై ఈ జవాద్ తుఫాన్ ప్రభావం పడుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా సముద్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు…
బంగాళాఖాతంలో జవాద్ తుఫాన్ మరింత బలపడి తీవ్ర తుఫాన్‌గా మారనుంది. ఈ తుఫాన్ ఉత్తరాంధ్ర తీరం వద్దకు దూసుకువస్తోంది. ఉత్తర దిశగా కదులుతూ ఆదివారం మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుఫాన్ తీరం దాటిన తర్వాత బంగాళాఖాతం వైపు వెళ్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో రానున్న మూడు రోజులు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 80-100 కి.మీ. వేగంతో కూడిన ఈదురుగాలులతో కూడిన…
బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుపానును ఎదుర్కొనేందుకు కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తాజా పరిస్థితులను కేంద్రం సమీక్షించింది. ప్రాణ నష్టానికి అవకాశం లేకుండా.. ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలకు ఆదేశించింది. తుఫాను శనివారం ఉదయం నాటికి ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా ఏపీ, ఒడిశా రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.సముద్రంలో…
ఏపీలో జవాద్ తుఫాన్ రూపంలో మరో వాన గండం వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ తుఫాన్ హెచ్చరికలతో ఏపీ రైతాంగం ఆందోళనలో ఉంది. 20 రోజుల క్రితం కురిసిన వర్షాలకు ఇంకా కోలుకోని రైతాంగం… ఈ వర్షాల కారణంగా సగం పండిన వరిని కోసి కల్లాల్లో భద్రపరుస్తున్నారు. కుప్పలు వేసి భద్రపరచినా ధాన్యం రంగు మారే అవకాశం ఉండడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. ధాన్యం రంగు మారినా, మొలక వచ్చినా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు…
ఏపీ ప్రజలను మరో తుఫాన్ హడలెత్తిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్ మారి ఏపీ వైపు దూసుకొస్తోంది. విశాఖకు 670 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ దిశగా కదులుతోంది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలలో క్రమంగా వాతావరణం మారుతోంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాలలో అలజడి మొదలైంది. ఈదురుగాలుల తాకిడి కూడా పెరుగుతోంది. గంటకు 45 నుంచి 50 కి.మీ. మేర వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. శనివారం ఉదయానికి ఉత్తర కోస్తా,…
దూసుకొస్తున్న జవాద్ తుఫాన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను భయపెడుతోంది… తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థకు జవాద్ తుఫాన్ టెన్షన్ పట్టుకుంది.. గంటలకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వస్తే నష్టం తప్పదని అంచనా వేస్తున్నారు అధికారులు… ముందస్తు చర్యల్లో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. గాలుల వేగం గంటలకు 50 కిలోమీటర్లు దాటితే ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తుగా విద్యుత్ సరఫరా నిలిపివేయాలని నిర్ణయించారు.. ఇక, సమస్య తలెత్తిన సబ్ స్టేషన్లు, ఫీడర్లు మరమ్మత్తు కోసం ప్రత్యేక…