India won by 106 runs against England in Vizag: వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్య ఛేదనలో 69.2 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో 106 పరుగుల తేడాతో రోహిత్ సేన గెలిచింది. టామ్ హార్ట్లీ (36)ను జస్ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా తలో మూడు…
Ollie Pope Stuns with Jasprit Bumrah’s Yorker in IND vs ENG 2nd Test: విశాఖలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనంలో కీలకపాత్ర పోషించాడు. బుమ్రా దెబ్బకు ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌట్ అయింది. యార్కర్స్, స్వింగ్ బంతులతో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్…
ICC Shock to Jasprit Bumrah: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో నిబంధనలను అతిక్రమించినందుకు గానూ టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మందలించింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఓలీ పోప్ పరుగు తీస్తుండగా.. బుమ్రా ఉద్దేశపూర్వకంగా అతడిని అడ్డుకున్నట్లు మ్యాచ్ రిఫరీ నిర్ధారించాడు. దాంతో బుమ్రాను ఐసీసీ మందలించడంతో పాటు అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జత చేసింది. ఇంగ్లండ్…
Indian Team Net Practice Video Goes Viral: భారత్, ఇంగ్లండ్ జట్ల 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జనవరి 25న మొదటి టెస్ట్ ఆరంభం కానుంది. టెస్టు సిరీస్‌ని విజయంతో ఆరంభించాలని టీమిండియా చూస్తోంది. మరోవైపు సొంతగడ్డపై రోహిత్ సేనను చిత్తుగా ఓడించేందుకు ఇంగ్లండ్ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇరు జట్లు పటిష్టంగా ఉండడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఉప్పల్ టెస్ట్ మ్యాచ్ కోసం ప్రస్తుతం…
ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు భారత్ సిద్దమవుతోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ జనవరి 25న ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇరు జట్లు ఉప్పల్ మైదానంలో కఠోర సాధన చేస్తున్నాయి. తమ బాజ్‌బాల్ సిద్ధాంతంతోనే టీమిండియాపై పైచేయి సాధించాలని ఇంగ్లీష్ జట్టు భావిస్తోంది. అయితే బాజ్‌బాల్ భారత పిచ్‌లపై పెద్దగా ప్రభావం చూపదని మాజీలు అంటున్నారు. దీనిపై తాజాగా టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. బాజ్‌బాల్…
పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌కు పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ట్రాన్స్‌లేటర్‌గా మారాడు. సిరాజ్ హిందీలో మాట్లాడితే.. బుమ్రా ఆ వ్యాఖ్యలను ఆంగ్లంలోకి అనువదించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విషయం సాధించింది. ఈ విజయంలో బుమ్రా, సిరాజ్ కీలక పాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 6 వికెట్స్ తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 6…
Jasprit Bumrah Wins Player of the Series award on South African Soil: 18 నెలల విరామం తర్వాత టెస్ట్ క్రికెట్లోకి తిరిగి వచ్చిన భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా సత్తాచాటాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 12 వికెట్స్ పడగొట్టాడు. దాంతో ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. సెంచూరియన్ టెస్ట్ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన బుమ్రా.. కేప్ టౌన్ టెస్టులో 8 వికెట్స్ తీశాడు.…
తన హృదయంలో కేప్‌టౌన్ మైదానానికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. టెస్ట్ మ్యాచ్ ఇంత తొందరగా ముగుస్తుందని తాను ఊహించలేదని, టెస్టు క్రికెట్ సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుందన్నాడు. విదేశీ పరిస్థితుల్లో రాణించాలంటే నిలకడగా బౌలింగ్ చేయాల్సి ఉంటుందని బుమ్రా చెప్పాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా (6/61) ప్రొటీస్ జట్టు పతనాన్ని శాసించాడు. రెండు మ్యాచ్‌ల టెస్టు…
Jasprit Bumrah Takes 5 Wickets in IND vs SA 2nd Test: కేప్‌టౌన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. రెండో రోజైన గురువారం సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికాకు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా షాక్ ఇచ్చాడు. మొదటి సెషన్ తొలి ఓవర్లనే ఓవర్ నైట్ బ్యాటర్ డేవిడ్ బెడింగ్హామ్ (11)ను ఔట్ చేశాడు. కాసేపటికే కైల్ వెర్రెయిన్నే (9)ను పెవిలియన్ చేర్చాడు. దాంతో ఆదిలోనే రెండు…
భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పాడు. టెస్ట్ సిరీస్ కోసం తాను దక్షిణాఫ్రికా వెళ్లేందుకు రెడీగా లేనట్లు వెల్లడించాడు. తన మోకాలి నొప్పి కోసం చికిత్స తీసుకుంటున్నాను.. కాస్త ఊరట లభించినా కచ్చితంగా టీమ్ తో కలుస్తానని వెల్లడించాడు.