శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ చెలరేగిపోయాడు. 27 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 84 పరుగులు చేశాడు. కొడితే బౌండరీ.. లేకపోతే సిక్సర్ అన్నట్లు జేక్ ఇన్నింగ్స్ సాగింది. ఫ్రేజర్ క్రీజులో ఉన్నంతసేపు ఢిల్లీ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ల్యూక్ వుడ్‌ను మాత్రమే కాకుండా.. యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రాను సైతం అతడు వదలలేదు. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఫ్రేజర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న అనంతరం ముంబై ఇండియన్స్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంపై జేక్ ఫ్రేజర్ స్పందించాడు. ‘ఆరంభంలో కాస్త ఆందోళకు గురయ్యా. త్వరగానే కుదురుకున్నా. పరుగులు చేయడం సంతోషంగా ఉంది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్లను కొట్టాలంటే చాలా తెగువ కావాలి. అందుకే అతడి బౌలింగ్ వీడియో ఫుటేజీలను బాగా చూశా. ప్రతి బంతిని నిశితంగా గమనించి హిట్టింగ్ చేయడానికి ప్రయత్నించా. వీడియోచూడడం పనికొచ్చింది’ అని ఫ్రేజర్ అన్నాడు.
Also Read: Rishabh Pant: దాని వల్ల ప్రతి రోజూ గండమే: రిషబ్ పంత్
‘పంచంలోనే అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొనే అవకాశం ఐపీఎల్ టోర్నీ ద్వారా దక్కింది. ఎత్తుపల్లాల అధిగమించి ముందుకుసాగాలి. ఈ ఇన్నింగ్స్‌తో నా ఆత్మవిశ్వాసం పెరిగింది. అంతేకాదు జట్టుకు ఎంతో ఉపయోగపడటం ఆనందంగా ఉంది. బయట నుంచి చూస్తే ఐపీఎల్‌లో పోటీ ఎలా ఉంటుందో తెలియదు. అందుకే ఇతర లీగ్‌లతో పోలిస్తే బాగా సక్సెస్ అయింది. ఐపీఎల్‌లో భాగం కావడం అద్భుతంగా ఉంది’ అని జేక్ ఫ్రేజర్ చెప్పుకొచ్చాడు.