Highest Paid Indian Cricketers: ఇటీవల ఐపిఎల్ 2025 కు సంబంధించి మెగా వేలం పూర్తయింది. ఈ వేలంలో రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్మడుపోయాడు. రిషబ్ పంత్ ని లక్నో సూపర్ జెయింట్స్ (LSG) 27 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. దీంతో అతడు సరికొత్త రికార్డులను సృష్టించాడు. పంత్ తర్వాత శ్రేయ సయ్యర్ ను పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లకు సొంతం చేసుకొని రెండో అత్యధిక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇకపోతే ఈ ఐపీఎల్ వేలం ముగిసిన తర్వాత భారతీయ ఆటగాళ్లు సంబంధించి ఎవరు అత్యధికంగా సంపాదించాలన్న విషయం ఇప్పుడు అందరిని ఆలోచించాలి చేస్తోంది. ఇందులో భాగంగా.. ఐపీఎల్ వేలంలో పొందిన మొత్తం, అలాగే బీసీసీఐ కాంట్రాక్ట్ కలిపి ఎంత మొత్తం సంపాదించారన్న విషయానికి వెళ్తే.. అత్యధికంగా రిషబ్ పంత్ 30 కోట్ల రూపాయలతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇందులో రిషబ్ పంత్ ఐపిఎల్ ద్వారా రూ. 27 కోట్లు సంపాదించగా.. బీసీసీఐ కాంట్రాక్ట్ తో రూ. 3 కోట్లు కలిపి మొత్తం రూ. 30 కోట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.
Also Read: PM Modi Letter To Palestine: పాలస్తీనా ప్రజలకు ప్రధాని మోడీ లేఖ.. అండగా ఉంటామని వెల్లడి
ఇక పంత్ తర్వాత ఈ లిస్ట్ లో టీమిండియా స్టార్ బాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఈయన ఈ ఏడాది రూ. 28 కోట్లు అందుకున్నాడు. ఆర్సిబి రూ. 21 కోట్లకు అంటి పెట్టుకోగా.. బీసీసీఐ కాంట్రాక్ట్ తో రూ. 7 కోట్లు కలిపి మొత్తం రూ. 28 కోట్లతో రెండో స్థానములో నిలిచాడు. ఇక ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. ముంబై ఇండియన్స్ రూ. 18 కోట్లకు అంటి పెట్టుకోగా.. బీసీసీఐ కాంట్రాక్ట్ తో రూ. 7 కోట్లు కలిపి మొత్తం రూ. 25 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్టార్ అల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా రూ. 25 కోట్లతో ఉన్నాడు. ఇక ఈ లిస్టులో మరో ఆటగాడు రోహిత్ శర్మ రూ. 23.3 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాడు.