ICC Mens Player Of The Month: బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో అదరగొడుతున్న జస్ప్రీత్ బుమ్రాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముందుగా నవంబర్ 2024 నెలకు గాను ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఐసీసీ జస్ప్రీత్ బుమ్రాను నామినేట్ చేసింది. బుమ్రాతో పాటు మార్కో యాన్సెన్, హారిస్ రౌఫ్ కూడా ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. తాజాగా ఐసీసీ ఈ అవార్డు విజేతను ప్రకటించింది. ఇందులో పాకిస్తాన్ పేసర్ హారిస్ రౌఫ్ ఈ అవార్డును గెలుచుకోవడం ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది.
Also Read: Mallikarjun Kharge: సభ అంతరాయాలకు రాజ్యసభ ఛైర్మనే కారణం
ఇకపోతే, హరిస్ రౌఫ్ గత నెలలో ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మూడు వన్డేల్లో 10 వికెట్లు పడగొట్టి 22 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్ విజయానికి కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 9 మ్యాచ్‌ల్లో మొత్తం 18 వికెట్లు తీశాడు.ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ కూడా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ తర్వాత జరిగిన టీ20ఐ సిరీస్లో కూడా హారిస్ రౌఫ్ మంచి ప్రదర్శన కనబరిచాడు. సిడ్నీలో తీసిన 4 వికెట్లతో సహా టీ20 సిరీస్లో మొత్తం 5 వికెట్లు పడగొట్టాడు. ఆ నెల చివరిలో అతను జింబాబ్వేలో పర్యటించి, వన్డే సిరీస్లో మొత్తం 3 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా, పాకిస్తాన్ వన్డే సిరీస్ ను గెలుచుకుంది. మొత్తంగా పాకిస్తాన్ నుండి ఈ అవార్డును గెలుచుకున్న 5వ ఆటగాడిగా హారిస్ రౌఫ్ నిలిచాడు.
Also Read: Heart Attack For Student: తరగతి గదిలోనే హార్ట్ ఎటాక్‌తో కుప్ప కూలిన బాలిక (వీడియో)
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టులో భారత్ విజయం సాధించింది. జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్లో మొత్తం 8 వికెట్లు తీయడంతో బుమ్రాతో 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో 30 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్లో 42 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దింతో అతను ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికయ్యాడు.