గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7), క్వాడ్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) సహా మూడు కీలక బహుపాక్షిక శిఖరాగ్ర సమావేశాలలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం జపాన్, పాపువా న్యూ గినియా, ఆస్ట్రేలియాలలో ఆరు రోజుల పాటు పర్యటించనున్నారని విదేశాంగ శాఖ ప్రకటించింది.
Dog : కుక్క విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కసారి వాటికి ప్రేమను చూపిస్తే చాలు చచ్చేంత వరకు విశ్వాసంగా పడి ఉంటాయి. అంతే కాకుండా ట్రైనింగ్ పొందిన పోలీసు జాగిలాలు నేరస్థులను పట్టేస్తాయి.
Hairy Tongue : కాలం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. రోజుకో కొత్త రోగం మార్కెట్లోకి వస్తుంది. తాజాగా జపాన్ లో ఓ మహిళకు వచ్చిన జబ్బు గురించి తెలిస్తే నిజంగా అవాక్కవ్వాల్సిందే. చాలా మందికి నాలుక మీద మచ్చలు ఉంటాయి.
Earthquake: జపాన్ దేశం మరోసారి భూకంపానికి వణికింది. జపాన్లోని సెంట్రల్ ఇషికావా ప్రాంతంలో శుక్రవారం 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆ దేశ వాతావరణ శాఖ వెల్లడించింది. జపాన్ స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2.42 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు. సునామీపై ఎలాంటి హెచ్చరికలు చేయలేదు. భూకంపం ధాటికి నగానో మరియు కనజావా మధ్య షింకన్సేన్ బుల్లెట్ రైళ్లను నిలిపేశారు. సుజీ సిటీలో కొండచరియలు విరిగిపడ్డాయి.
ఇదిలా ఉంటే కొందరు మాత్రం తమకు మక్కువ ఉన్న రంగంలోకి వెళ్తున్నారు. అలాంటి కోవలోకే వస్తారు తమిళనాడుకు చెందిన 27 ఏళ్ల యువకుడు వెంకటసామి విఘ్నేష్. ఇన్ఫోసిస్ వంటి ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీలో ఉద్యోగం నెలకు రూ. 40,000 జీతం అయినా ఇవన్నీ వదిలేసి తనకు మక్కువ ఉన్న వ్యవసాయ రంగంలోకి వెళ్లేందుకు ఉద్యోగం మానేశాడు. తల్లిదండ్రులు మొదట్లో భయపడ్డా కూడా ప్రస్తుతం లక్షల్లో సంపాదిస్తూ.. వారి భయాలను దూరం చేశాడు.
Water Melon : వేసవి వచ్చిందటే ప్రతి ఒక్కరూ పుచ్చకాయను తినేందుకు ఇష్టపడుతారు. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో వాటర్ కంటెంట్ పెరిగి.. కొంత ఉపశమనం పొందుతారు.
North Korea: ఉత్తర కొరియా మరో క్షిపణిని పరీక్షించింది. ‘‘సాలిడ్ ఫ్యూయల్’’ ఖండాంతర క్షిపణిని పరీక్షించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా శుక్రవారం వెల్లడించింది. అణు దాడిని ఎదుర్కొనే లక్ష్యంలో ఇది ముందడుగు అని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అన్నారు. ‘‘హాసాంగ్-18’’ అనే పేరుతో పిలువబడే ఖండాంతర క్షిపణి తమ వ్యూహాత్మక సైనిక శక్తిని పెంచుతుందని, అణుదాడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతుందని కిమ్ అన్నట్లు కేసీఎన్ఏ వార్తా సంస్థ పేర్కొంది.
జపాన్ కు చెందిన ఓ సైనిక హెలకాప్టర్ అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది. నైరుతి ఒకినావా ద్వీపంలో భాగమైన మియాకోజిమా సమీపంలో అనేక మంది సిబ్బంది, ప్రయాణీకులను తీసుకువెళుతున్న సైనిక హెలికాప్టర్తో సంబంధాలు తెగిపోయాయి.
Puffer Fish: మలేషియాకు చెందిన 83 ఏళ్ల మహిళ, ఆమె భర్త అత్యంత విషపూరితమైన ‘‘పఫర్ ఫిష్’’ ను తిని ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. ఈ చేపను తిన్న తర్వాత భార్య చనిపోగా, భర్త ఐసీయూలో కోమాలో ఉన్నాడు. ప్రస్తుతం అతడికి చికిత్స చేస్తున్నారు వైద్యులు. వీరి కుమార్తె చెప్పిన దాని ప్రకారం సమీపంలో ఉన్న మార్కెట్ నుంచి ఈ డెడ్లీ చేపను తన తండ్రి కొనుగోలు చేసినట్లు బాధితుల కుమార్తె వెల్లడించారు.