తెలుగులో మజ్ను సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది హాట్ బ్యూటీ అయిన అను ఇమ్మాన్యుయేల్. మొదటి సినిమా తోనే అందం అభినయంతో అందరిని కట్టిపడేసింది ఈ బ్యూటీ. మత్తేక్కించే విశాలమైన కళ్ళ తో అందరిని ఆకట్టుకుంది అను ఇమ్మాన్యుయేల్.ఇక మజ్ను తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బాగా దూసుకుపోయింది. అయితే వరుస సినిమా లు చేస్తున్నప్పటికీ ఈ చిన్న దానికి మంచి సాలిడ్ హిట్ మాత్రం అయితే దక్కలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీగా అజ్ఞాతవాసి లో చేసినప్పటి కీ కూడా ఆ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. రీసెంట్ గా అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ తో కలిసి ఊర్వశివో రాక్షసివో అనే సినిమా చేసింది. ఈ సినిమా లో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి మరీ నటించింది. ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కూడా ఆ క్రెడిట్ మాత్రం ఈ బ్యూటీ ఖాతాలో పడలేదు.
అయితే ఈ అమ్మడి కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. తెలుగులో అనుకున్న స్థాయి లో స్టార్ డమ్ సొంతం చేసుకోలేకపోయిన అను ఇమాన్యూయల్ .తమిళ పరిశ్రమ పై బాగా దృష్టి పెట్టింది. ఈ అమ్మడు అక్కడ వరుస అవకాశాల ను అందుకుంటోంది. కార్తీ సరసన జపాన్ లో అను హీరోయిన్ గా అయితే నటించింది.ఈ సినిమా లో అమ్మడి అందం, నటన అక్కడి ప్రేక్షకులను బాగా మెప్పించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు తమిళ్ లో మరో చేసే ఛాన్స్ ను అందుకుందని తెలుస్తోంది. అది కూడా కార్తీ సినిమా లోనే అని సమాచారం.. 96 ఫేం ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని తెలుస్తుంది.. మరి ఈ హిట్ అయ్యితే అను తమిళ్ లో బిజీ గా మారుతుంది ఈ భామ.