జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ శివారు జాతీయ రహదారిపై లారీని వెనక నుంచి ఢీకొట్టింది కారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ప్రమాద స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. హనుమకొండ నుంచి హైదరాబాద్ కియా కారు వెళుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.