జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో జరిగింది. బ్యాంక్ లోన్ కట్టలేదని బ్యాంకు పనులను వదిలిపెట్టుకుని మరీ.. రైతు ఇంటికి వచ్చి గేటును జప్తు చేసి తీసుకుపోయారు డీసీసీబీ బ్యాంక్ అధికారులు.
జనగామ నియోజకవర్గంలోని ఎర్రగుంటతండాలో ఆదివారం బీఆర్ఎస్ కార్యకర్తలపై జరిగిన దాడిని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఖండించారు. ఈరోజు జరిగిన అరాచకం నిజాంపాలనలో కూడా జరగలేదని పల్లా మండిపడ్డారు. పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోమని, మలి దశ ఉద్యమ సమయంలో పోరాడిన గడ్డ జనగామ అని మర్చిపోవద్దని హెచ్చరించారు. తమ కార్యకర్తలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జనగామ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రారంభించిన 4 పథకాలను పేదలందరికీ అందించాలని కోరిన ఎమ్మెల్యే పల్లా,…
జనగామ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.. జిల్లా కేంద్రంలోని వినాయక బార్ వెనుకాల ఓ వ్యక్తిని స్నేహితులు బండ రాయితో కొట్టి నిప్పంటించారు. మృతుడు జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో జీవనం కొనసాగిస్తున్న వెంకన్నగా పోలీసులు గుర్తించారు.
Samagra Kutumba Survey: దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రస్తుతానికి 15 జిల్లాల్లో నూటికి నూరు శాతం పూర్తయింది. సామాజిక సాధికారత లక్ష్యంగా అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇకపోతే, ఇప్పటివరకు రాష్ట్రంలో 94.9 శాతం సర్వే పూర్తయింది. నవంబర్ 6వ తేదీన మొదలైన ఈ సర్వే ద్వారా 27 రోజుల్లో 1,11,49,488…
జనగామలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని విజయషాపింగ్‌మాల్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగగా.. షాపింగ్‌మాల్ పూర్తిగా దగ్ధమైంది.
జనగామ జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. జిల్లా కేంద్రంలోని బీరప్ప గడ్డలో కెమిడి లక్ష్మయ్యకు చెందిన 30 మేకలను గుట్టుచప్పుడు కాకుండా కొట్టం నుండి అర్థరాత్రి గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. పండగ సమయంలో జిల్లాలో మేకల దొంగతనం కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై బాధితుడు లక్ష్మయ్య పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
Jangaon Hostel: జనగామ జిల్లా జనగామ మండలం పెంబర్తిలోని మహాత్మా జ్యోతిబాఫూలే హాస్టల్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. అర్థరాత్రి గోడ దూకి 19 మంది విద్యార్థులు పరారయ్యారు.
ఓ ప్రైవేట్ స్కూల్‌లో విద్యార్థులు, తోటి స్టాఫ్‌తో కలిసి ప్రేయర్ చేస్తున్న టీచర్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అనంతరం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
గుప్తనిధుల పేరుతో బడా మోసం చేస్తున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 15 లక్షల 47 వేల నగదు, 540 వెండి రేకు నాణేలు, 76 బంగారు రేకు నాగ పడిగ బిల్లలు, పూజ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో.. జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ వివరాలను వెల్లడించారు.
ప్రేమ మత్తులో పడి యువతకు కళ్ళు మూసుకుపోయాయి. వయసులో ప్రేమకు ఆకర్షణకు మధ్య తేడా తెలియక చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు మోసపోతున్నారు. ప్రేమించిన వారి కోసం ఇంటి నుంచి పారిపోయి తల్లిదండ్రులను బాధ పెట్టే వారు కొందరైతే.. ప్రేమ పేరుతో మోసపోయిన ఆత్మహత్యలు చేసుకున్న వారు మరి కొందరు.