జనసేన ఎమ్మెల్యేలకు ఇప్పుడు తత్వం బోథపడిందా? ఏడాదిగా ఎక్కడున్నారో… ఏం చేస్తున్నారో కూడా తెలియని వాళ్ళు సైతం ఇప్పుడు నియోజకవర్గాల బాటపట్టి… మేం పక్కా లోకల్ అంటున్నారా? ఉన్నట్టుండి అంత మార్పు ఎలా వచ్చింది? ఉలిక్కిపడి లేచినట్టు… వాళ్లంతా ఒక్కసారిగా ఎందుకు అలర్ట్ అయ్యారు? వాళ్ళని అలా పరుగులు పెట్టిస్తున్న అంశమేది? 2024 ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేట్‌తో గెలిచాక…ఆ ఊపుతో ముందుకెళ్లాల్సిన జనసేన నాయకులు కొన్ని నియోజకవర్గాల్లో పత్తా లేకుండా పోతున్నారట. పార్టీ కార్యక్రమాలను పక్కనబెట్టి…
వంగవీటి మోహన రంగా... ఆయన భౌతికంగా దూరమై దశాబ్దాలు గడుస్తున్నా... ఆ పేరు మాత్రం ఎప్పటికప్పుడు ఏపీ పాలిటిక్స్‌ని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎన్నికలు వచ్చినప్పుడైతే... రకరకాల ఈక్వేషన్స్ వంగవీటి చుట్టూనే తిరుగుతుంటాయి. కులాలకు అతీతంగా ఆయన్ని అభిమానించే వాళ్ళు ఉన్నా... ప్రత్యేకించి కాపులు మాత్రం ఎక్కువగా ఓన్ చేసుకుంటారు. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో పొలిటికల్ హంగామా కూడా ఎక్కువగానే జరుగుతూ ఉంటుంది.
అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్‌ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్ధి రాజాపు సిద్ధూని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపం ఇచ్చిన సిద్ధూ గురించి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నారు. వెంటనే మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి అతడిని పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. సిద్దూ ఆవిష్కరించిన సైకిల్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా నడిపారు. సైకిల్‌పై సిద్ధూని కూర్చోబెట్టుకొని క్యాంపు…
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన నలుగురు వైసీపీ జెడ్పీటీసీలు జనసేనలో చేరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ కండువా కప్పుకున్నారు. జనసేనాని నలుగురు జెడ్పీటీసీలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చింతలపూడి జెడ్పీటీసీ సభ్యులు పొల్నాటి శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం జెడ్పీటీసీ సభ్యులు ముత్యాల ఆంజనేయులు, అత్తిలి జెడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల జానకి, పెరవలి జెడ్పీటీసీ సభ్యురాలు కొమ్మిశెట్టి రజనీ జనసేన పార్టీలో చేరారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను…
ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్నకుమార్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్న ఆయన.. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరచే వ్యాఖ్యలు చేయడం వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు.
పవన్ ఏదో చేస్తారని పిఠాపురం ప్రజలు ఆశపడ్డారు.. కానీ, ఏడాది గడిచినా పిఠాపురంలో అభివృద్ధి సున్నా అని ఎద్దేవా చేశారు. పవన్ సీఎం అవుతానని చెప్పి.. మరొకరిని ముఖ్యమంత్రిని చేశారని తెలిపారు. ఇక, రాజకీయంగా జన్మనిచ్చిన పిఠాపురంలో పవన్ అంతం అయ్యేలా వచ్చే ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలని జక్కంపూడి రాజా కోరారు.
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర విషయం పంచుకున్నారు. నెల్లూరులో తనకు ఇంటర్ సీటును దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఇప్పించారని తెలిపారు. తాను ప్రభుత్వ ఉద్యోగి కొడుకును కాబట్టి.. ప్రకాశం, నెల్లూరు సహా ఐదారు జిల్లాలో తిరిగానని చెప్పారు. ప్రకాశం జిల్లా అంటే గుర్తుకు వచ్చేది ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని పేర్కొన్నారు. సైమన్ కమిషన్‌కి ఎదురొడ్డి నిలిచిన ధైర్యవంతుడు ప్రకాశం పంతులు అని పవన్…
ఈవీఎం మాయాజాలం తోడై కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు ఆర్కే రోజా.. కళ్ల బొల్లి మాటలు, వాగ్దానాలకు ప్రజలు నమ్మి ఓటు వేశారు, గెలిచాక మాటమార్చారని విమర్శించారు.. కుక్కతోక వంకర తరహాలో చంద్రబాబు ఎన్నికలు ముందు మారాను అని చెప్పి, అధికారంలోకి వచ్చాక మళ్లీ అదే విధంగా ఆలోచన చేస్తున్నారు అని దుయ్యబట్టారు
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి శ్రీమతి వాసుకి (పాకీజా)కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆప్త హస్తం అందించారు. ఆమె దీన స్థితి తెలిసి చలించిన పవన్ కళ్యాణ్ రూ. 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళగిరి మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్, పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాకీజాకు అందజేశారు. Also Read:Silk Smitha :…
ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలతో పాటు ఏపీ పాలిటిక్స్‌లో కూడా పెద్దగా పరియం అక్కర్లేని పేరు బాలినేని శ్రీనివాసరెడ్డి. రాజకీయాల్లో మిస్టర్ కూల్ అన్న పేరుంది ఆయనకు. దాదాపు పది నెలల క్రితం వరకు ఆయన పొలిటికల్ లైఫ్ సాఫీగానే ఉన్నట్టు అనిపించింది.