జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్చార్జ్ కోట వినూత వివాదంపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బోజ్దల సుధీర్ రెడ్డి స్పందించారు. దేవుడి సన్నిధిలో ప్రమాణం చేసి చెబుతున్నా అని, వినూత ఘటనలో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. రాజకీయ కారణాలతో ఈ ఘటన జరిగిందన్నారు. వైసీపీ నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే బోజ్దల చెప్పారు. అలానే శ్రీనివాస్ అలియాస్ రాయుడు హత్య విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే…
వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి నాదెండ్ల మనోహర్.. అవగాహన లేకుండా, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు అంటూ ధ్వజమెత్తారు. ప్రజలు అధికారాన్ని ఐదేళ్లకు ఇస్తారు.. అది జగన్ మర్చిపోయారా? అని నాదెండ్ల ప్రశ్నించారు. ఇంతకాలం గుంతలు కూడా పూడ్చలేని నాయకుడు.. ఈ రోజు పాలన గురించిమాట్లాడుతున్నాడు అంటూ ఫైర్ అయ్యారు.
కైకలూరుకు చెందిన నాయకుడు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ వ్యవహారాన్ని అనుమానాస్పదంగా చూస్తున్నాయి ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయ వర్గాలు. ఆయన మనసులో ఏముంది? అడుగులు ఎటువైపు పడుతున్నాయని గుసగుసలాడుకుంటున్నారు. ఉన్నట్టుండి సైలెంట్ అవడం వెనక ప్రత్యేక కారణాలు ఉన్నాయా అంటూ ఆరాలు తీస్తున్నారు. గతంలో టీడీపీలో ఉన్న వెంకటరమణ వైసీపీలో చేరాక ఆ పార్టీ ఎమెల్సీ పదవి ఇచ్చింది.
హైదరాబాద్‌లో నిర్వహించిన రాజ్యభాష విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.. అయితే, దీనిపై జనసేన పార్టీ స్పందించింది.. భిన్నత్వంలో ఏకత్వం, జాతీయ సమగ్రత, భాషా సామరస్యంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలోచన విధానమపి స్పష్టం చేసింది.
జనసేనకు చెందిన కొందరి నేతల డర్టీ పనులు పార్టీపై ప్రభావం చూపిస్తున్నాయి. ప్రతిపక్షాలు మాత్రమే కాదు, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సామాన్యులు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. కొందరు నేతల డర్టీ వీడియోలు, లైంగిక ఆరోపణలు, కుటుంబ కలహాలు ఇలా ప్రతి సంఘటన కూడా ప్రత్యక్షంగా పార్టీపై ప్రతికూలంగా ప్రభావం చూపుతున్నాయి.
Pawan Kalyan : పవన్ కల్యాణ్ వర్సెస్ ప్రకాశ్ రాజ్ వార్ మరోసారి తెరమీదకు వచ్చింది. అది కూడా హిందీ భాష మీదనే. గతంలోనూ హిందీ భాష విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరిగాయి. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన రాజ్యభాష విభాగం స్వర్ణోత్సవంలో పవన్ కల్యాణ్ పాల్గొని హిందీ భాషపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మాతృభాష అమ్మలాంటిది అయితే హిందీ భాష పెద్దమ్మ లాంటిది అన్నారు. హిందీ నేర్చుకుంటే మనల్ని తక్కువ చేసుకున్నట్టు కాదని.. మరింత…
పార్టీకి బలం ఉన్నచోట… కేడర్ ఉంటే చాలు లీడర్స్‌తో పనేముందని జనసేన అధిష్టానం భావిస్తోందా? సైనిక బలగం ఎంతున్నా… నడిపే దళపతి ఒకడు ఉండాలన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించిందా? అందుకే తనకు పట్టున్న ఆ ఉమ్మడి జిల్లాలో ఇన్‌ఛార్జ్‌ల నియామకాన్ని విస్మరించిందా? ఓవైపు లీడర్స్ కొరతతో సతమతం అవుతూ మరోవైపు ఉన్నవాళ్లని వరుసబెట్టి సస్పెండ్ చేయడాన్ని ఎలా చూడాలి? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన వ్యవహారం గందరగోళంగా మారుతోంది. మొత్తం 19…
జనసేన పార్టీ కొవ్వూరు నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావును అధిష్టానం తప్పించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ కాప్లిక్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. జనసేన పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడం పట్ల టీవీ రామారావు విచారం వ్యక్తం చేశారు. తాను ఏ తప్పు చేయలేదని చెప్పారు. కార్యకర్తల మనోభవాలు దెబ్బతిన్న కారణంగా ఆగ్రహంతో రోడ్డెక్కారని స్పష్టం చేశారు. అధిస్థానం తీసుకున్న…
2024 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ కుటుంబం క్యారెక్టర్ గురించి మాట్లాడినప్పుడు తాము చాలా భాధపడ్డాం అని వైసీపీ నేత జక్కంపూడి గణేష్ తెలిపారు. ల్యాండ్ మాఫియా, బెట్టింగ్ క్లబ్‌ల మీద తమపై చేసిన ఆరోపణలు నిరూపించమని ప్రశ్నిస్తున్నామన్నారు. తమపై ఆరోపణలు రుజువు చేయండి, లేదంటే చేతగాని వాళ్లమని ఒప్పుకోండన్నారు. తమ క్యారెక్టర్‌పై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగుందని జక్కంపూడి గణేష్ హెచ్చరించారు. Also Read: TV Rama Rao: జనసేన…
జనసేన కొవ్వూరు నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావును అధిష్టానం తప్పించింది. ఈ మేరకు పార్టీ కాప్లిక్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. కొవ్వూరు నియోజకవర్గంలోని సహకార సొసైటీల నియామకాల్లో అన్యాయం జరిగిందని టీవీ రామారావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. కొవ్వూరు టోల్ గేట్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. కొవ్వూరు నియోజకవర్గంలోని 14 సొసైటీలు ఉండగా.. దీనిలో మూడు పదవులు తమకు కేటాయించాలని…