జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జ్ కోట వినూత వివాదంపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బోజ్దల సుధీర్ రెడ్డి స్పందించారు. దేవుడి సన్నిధిలో ప్రమాణం చేసి చెబుతున్నా అని, వినూత ఘటనలో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. రాజకీయ కారణాలతో ఈ ఘటన జరిగిందన్నారు. వైసీపీ నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే బోజ్దల చెప్పారు. అలానే శ్రీనివాస్ అలియాస్ రాయుడు హత్య విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే బోజ్దల సుధీర్ రెడ్డి ఈరోజు శ్రీకాళహస్తి దేవుడి సన్నిధిలో మీడియాతో మాట్లాడాడారు. ‘నాకు కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు. దేవుడి సన్నిధిలో కుటుంబం సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నా. శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌ఛార్జి కోట వినుత ఘటనలో నా ప్రమేయం లేదు. రాజకీయ కారణాలతో ఘటన జరిగింది. వైసీపీ వాళ్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. డ్రైవర్ శ్రీనివాస్ హత్య విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని ఎమ్మెల్యే బోజ్దల తెలిపారు.
ఇటీవల డ్రైవర్ శ్రీనివాస్ చెన్నైలో మృతి చెందాడు. కోట వినుత వద్ద అతను డ్రైవర్‌గా పని చేసేవాడు. వినుత బెడ్ రూమ్‌లో శ్రీనివాస్ రహస్య కెమెరాలు పెట్టి.. వీడియోలు రికార్డు చేశాడు. శ్రీనివాస్ రూ.30 లక్షలకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి విక్రయించారని వినూత దంపతులు ఇటీవల చెప్పారు. తమ వ్యక్తిగత వీడియోలతో ఎమ్మెల్యే బొజ్జల బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు చెప్పాం అని, సీఎం చంద్రబాబుతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. శ్రీనివాస్ హత్య కేసులో వినూత దంపతులను చెన్నై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించారు.