Perni Nani: జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవ సభపై సెటైర్లు వేశారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్నినాని.. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. జనసేన సభ కేవలం చంద్రబాబు, పవన్ ల తస్మదీయ దూషణల సభ మాత్రమే.. మనం ఏం చేశాం.. మనలో లోపాలేంటి అనేది చర్చించుకోవడం రాజకీయ పార్టీ లక్షణం.. కానీ, చంద్రబాబు సేవ కోసమే పవన్ రాజకీయ పార్టీ పెట్టాడు అంటూ మండిపడ్డారు. తన పార్టీని అభిమానించే వారందరినీ చంద్రబాబుకు ఓటేయమంటున్నాడు పవన్ అని ఎద్దేవా చేసిన ఆయన.. చంద్రబాబు మేలు కోసమే పవన్ పని చేస్తున్నాడు.. ఇప్పటం సభకు.. మచిలీపట్నం సభకు పెద్ద తేడా ఉండబోదన్నారు.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
ఇక, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, నన్ను, కాపు నాయకులను దూషించడమే పవన్ పని.. మచిలీపట్నం సభలో జరగబోయేది కూడా అదే అన్నారు పేర్నినాని.. మచిలీపట్నంలో జరగబోయేది ఆవిర్భావసభ కాదు.. అస్మదీయ దూషణ సభగా పేర్కొన్న ఆయన.. కాపులను చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టడానికే పవన్ తాపత్రయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. పవన్ ఎప్పటికీ మారడు.. సినిమాలు ప్లాప్ అయితే నష్టాలొస్తాయి.. కానీ, ప్లాప్ అయిన సినిమాకు కూడా పవన్ కు లాభాలొచ్చేది ఇక్కడే అన్నారు.. ప్యాకేజ్ స్టార్ అంటే పవన్ కు కోపం వస్తుంది.. కానీ, ఓ చానెల్‌లో వెయ్యికోట్ల స్టార్ ప్యాకేజ్ అంటే ఆనందపడుతున్నాడు అని ఎద్దేవా చేశారు.. వైసీపీలో ఉన్న కాపు నేతలను అడ్డగోలుగా బూతులు తిట్టడానికే పవన్ సభ అంటూ మండిపడ్డారు పేర్నినాని.
Read Also: Cyclone Freddy: మలావిలో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం.. 100 మందికి పైగా మృతి
జనసేన పార్టీ ఆవిర్భావ సభ కూడా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లా జరుపుతారు.. ప్రజలకు కోసం త్యాగం చేశామనేవారికి సినిమాలు ఏంటి? అని ప్రశ్నించారు పేర్నినాని.. మా నాన్న కాపు, నాన్న బలిజ అని పవన్ చెబుతున్నారు.. అసలు, కాపులు, బలిజలు వేరు అని పవన్‌కు ఎవరు? చెప్పారు అని నిలదీశారు.. రాజకీయ నాయకుడికి ఏ కులం అయితే ఏంటి..? ఒకే కులం ఓట్లతో చట్ట సభలకు వెళ్తారా? అని మండిపడ్డారు.. మరో ఏడాదిలో పవన్ రంగులన్నీ బయటపడతాయి అంటూ సెటైర్లు వేశారు మాజీ మంత్రి పేర్నినాని.