బెజవాడలో అన్ని రోడ్లు ఇప్పుడు బందర్ వైపు దారితీస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా బెజవాడ అంతా జనసేనసంద్రంగా మారింది. జనసేన ఆవిర్భావ సభ షెడ్యూల్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం 5 గంటలకు మచిలీపట్నం సభకు చేరుకోవాల్సి ఉన్న పవన్ ఆ టైంకి చేరుకోలేదు.
బందర్ జనసేన సభలో సాంస్కృతిక కార్యక్రమాలు
4.30కి బెజవాడ కానూరుకి మాత్రమే చేరుకున్న పవన్.. ఇంకా 50 కిలోమీటర్లు మేర వెళ్లాల్సి ఉండటంతో సభా స్థలికి 7 గంటలకు చేరుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు, పోలీసులు. మరోవైపు జనసైనికులు భారీగా తరలిరావడంతో రోడ్లన్నీ స్తంభించిపోయాయి. భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది.