Pawan Kalyan will be back to shooting soon: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక పండగ లాంటి వార్త తెరమీదకు వచ్చింది. అయితే ఈ వార్త అధికారికం కాదు కానీ జనసేన వర్గాల్లో అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ప్రచారాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ అన్ని నిలిపివేసి మరి ఏపీలో వారాహి యాత్ర నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పుడు యాత్రకు బ్రేక్…
నన్ను ప్రాసిక్యూట్ చేయమని ప్రభుత్వం జీవో జారీ చేసింది. నేనోసారి మాట చెప్పానంటే అన్ని రిస్కులు తీసుకునే చెబుతాను. నన్ను అరెస్ట్ చేసుకోండి.. చిత్రవధ చేసుకోండి నేను సిద్ధమే అన్నారు. నేను ఏపీ అభివృద్ధికి కమిట్ మెంటుతో ఉన్నాను. నన్ను ప్రాసిక్యూషన్ చేయాలనుకుంటే చేయండి.. నేను సిద్దమే అని స్పష్టం చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్.. గురువారం ఉదయం నడ్డాతో భేటీ అయ్యారు. గంటకు పైగా కొనసాగిన ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పు తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎన్నికలకు సమాయత్తం అవ్వాల్సిన వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులను కూడా నడ్డా దృష్టికి పవన్ తీసుకెళ్లినట్టు సమాచారం. జనసేన అధినేత…
పవన్ సిగ్గు లేకుండా ఎన్డీయే మీటింగ్‌కు ఎందుకు వెళ్ళాడో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. మోడీకి చంద్రబాబు చేసిన అవమానాలు గుర్తున్నాయని.. అందుకే ఎన్డీయే మీటింగ్‌కి టీడీపీని పిలవలేదని.. కానీ పవన్ సిగ్గులేని వాడంటూ ఆమె వ్యాఖ్యానించారు. తల్లిని అవమానించిన చంద్రబాబును సీఎం చేసే పనిలో పవన్ ఉన్నారని ఆమె అన్నారు.