Minister RK Roja: మంత్రి ఆర్కే రోజా మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు.. రాష్ట్రంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చన్న ఆమె.. కానీ, పార్టీ పెట్టింది ఎందుకో పవన్ కల్యాణ్ కే తెలియదు అంటూ ఎద్దేవా చేశారు.. పవన్ కల్యాణ్.. ఇతర పార్టీలకు ఓట్లు వేయడానికే పార్టీ పెట్టాడు ఎమో అంటూ పంచ్‌లు వేశారు. ఇక, చంద్రబాబుకు అధికారంలో ఉన్నప్పుడు నిధులు అనుసంధానం మాత్రమే చేస్తాడు.. అధికారం లేకపోతే నదులు గురించి మాట్లాడటం చంద్రబాబుకు అలవాటే అని దుయ్యబట్టారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి నదులు అనుసంధానం ఎందుకు చేయాలేదు? అని నిలదీశారు మంత్రి ఆర్కే రోజా.
కాగా, ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ వల్ల మహిళలు, యువతులు అదృశ్యమయ్యారంటూ పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలకు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విషయం విదితమే.. శుక్రవారం ఆమె అనంతపురం జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ముందుగా పవన్ కల్యాణ్ వల్ల ఎంత మంది మహిళలు అదృశ్యమయ్యారో లెక్క తేలాల్సిన అవసరముందని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఏపీలో మహిళల అదృశ్యంపై ఏ నిఘా సంసథ నివేదిక ఇచ్చిందో వెల్లడించాలని డిమాండ్ చేసిన ఆమె.. పవన్ మాటాలు గురవింద గింజ సామెతలా ఉన్నాయని మండిపడిన విషయం విదితమే.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్