బ్రో సినిమాలో నన్ను గిల్లారు.. అందుకే నేను సినిమా గురించి మాట్లాడుతున్నానని తెలిపారు అంబటి రాంబాబు. నా పేరుతో సినిమాలో క్యారక్టర్ వేసి శునాకనందం పొందుతున్నారని పవన్‌పై ఫైర్ అయ్యారు. బ్రో చచ్చిన సినిమా అంటూ మండిపడ్డారు. ఇక, బ్రో సినిమాకి నువ్వు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నావు.. ? నిర్మాత ఎంత ఇచ్చాడో చెప్పాలి..? అంటూ పవన్ కల్యాణ్‌కు సవాల్ విసిరారు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక సోషల్ మీడియాలో కూడా పవన్ యమా యాక్టివ్ గా ఉంటారు. ఇండస్ట్రీలో ఏది జరిగినా అందుకు పవన్ స్పందిస్తూ ఉంటారు.
పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర దుమారం రేపాయి. పవన్ కళ్యాణ్ ని అంగడిలో సరుకు అనడంతో జనసైనికులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పేద, బడుగు వర్గాల వారి ముఖ్యమంత్రి జగన్ అహ్నరిశలు కృషి చేస్తున్నారని, దాన్ని చూసి ఓర్వలేక చంద్రబాబు, పవన్ జగన్‌పై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు.
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వర్షాలకు హైదరాబాద్ పట్నమే మునిగిపోయింది... చంద్రబాబు కట్టించిన హైటెక్ సిటీయే మునిగిపోయింది.. ఉత్తర భారత దేశంతో పాటు దేశ రాజధాని ఢిల్లీ నగరమే నీట మునిగిపోయింది.. ప్రత్యేక సందర్భంలో వచ్చే వర్షాలకు మునిపోవడం సహజం.. ఇక చంద్రబాబు కూడా వచ్చే ఎన్నికల్లో మునిగిపోక తప్పదని బొత్స అన్నారు.
ఏపీలో మహిళల మిస్సింగ్‌లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్లకు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రకటన చేశారని.. దానిపై పవన్ వ్యాఖ్యలు చేశారని ఆమె పేర్కొన్నారు.