జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్.. గురువారం ఉదయం నడ్డాతో భేటీ అయ్యారు. గంటకు పైగా కొనసాగిన ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పు తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎన్నికలకు సమాయత్తం అవ్వాల్సిన వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులను కూడా నడ్డా దృష్టికి పవన్ తీసుకెళ్లినట్టు సమాచారం. జనసేన అధినేత…
పవన్ సిగ్గు లేకుండా ఎన్డీయే మీటింగ్కు ఎందుకు వెళ్ళాడో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. మోడీకి చంద్రబాబు చేసిన అవమానాలు గుర్తున్నాయని.. అందుకే ఎన్డీయే మీటింగ్కి టీడీపీని పిలవలేదని.. కానీ పవన్ సిగ్గులేని వాడంటూ ఆమె వ్యాఖ్యానించారు. తల్లిని అవమానించిన చంద్రబాబును సీఎం చేసే పనిలో పవన్ ఉన్నారని ఆమె అన్నారు.
సిద్దాంతపరంగా భావజాలం కుదరని పార్టీలతో విపక్షాల కూటమి ఏర్పడిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. బీజేపీని ఓడించేందుకే కూటమిగా ఏర్పడ్డారని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో రూ. 7.14 లక్షల కోట్ల మేర అప్పు ఉందని ఆమె ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎన్డీఏ సమావేశంలో చర్చ జరగలేదని, దేశ రాజకీయ పరిస్థితుల గురించే ప్రధానంగా చర్చ జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్డీఏ పక్షాల సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ సమావేశం అనంతరం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.