జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి మూడో విడత వారాహి యాత్రను స్టార్ట్ చేయనున్నారు. విశాఖ పట్టణంలోకి పవన్ కళ్యాణ్ ప్రవేశించే రూట్ మ్యాప్ పై పోలీసుల నుంచి ఇంకా క్లారిటీ రాలేదని జనసేన నేతలు అంటున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు పోలీసులు షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చారు. అయితే.. కాసేపట్లో విశాఖ ఎయిర్ పోర్ట్ కు పవన్ కళ్యాణ్ రానున్నారు.
Read Also: Karimnagar: హుస్సేన్ పురలో పీఎఫ్ఐ కదలికలు.. ఎన్ఐఏ సోదాలు
అయితే, విశాఖ ఎయిర్ పోర్ట్ లోపల హై సెక్యురిటీ ఏర్పాటు చేశారు. ఎరివల్ పాయింట్ ను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటి ఫోర్స్ తమ అధీనంలోకి తీసుకుంది. బారి కేడ్లు, రోప్ పార్టీలను పోలీసులు ఏర్పాటు చేసింది. కాసేపట్లో వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్ పోర్ట్ కి చేరుకోనున్నారు.ఇక, జిల్లాలో పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు, సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కి స్వాగతం చెప్పడానికి ఎయిర్ పోర్ట్ కి జనసేన నేతలు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా హోటల్ కి జనసేనాని వెళ్లనున్నారు.. ఎటువంటి రోడ్ షోలు లేవని పోలీసులు చెప్తున్నారు.
Read Also: Vangaveeti Radha: నేడు అనుచరులతో వంగవీటి రాధా భేటీ.. దారెటు..?
ఇక, నేషనల్ హైవే రహదారి మీదుగా పవన్ విశాఖలోకి ప్రవేశిస్తే ట్రాఫిక్ కు సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని పోలీసులు అంటున్నారు. పోర్ట్ రోడ్డు గుండా పవన్ కళ్యాణ్ ను విశాఖ పట్టణంలోకి ప్రవేశించేందుకు పోలీసులు అనుమతించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయాలపై ఇంకా పోలీసుల నుంచి క్లారిటీ రాలేదని జనసేన నేతలు తెలిపారు. నేటి నుంచి ప్రారంభమయ్యే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగుతుంది.