టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ తేలింది. దీంతో ఆయన ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. చంద్రబాబు కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమని, త్వరగా కోలుకుని ప్రజల కోసం ఎప్పటిలాగే పనిచేయాలని కోరుకుంటున్నానని పవన్ అన్నారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య ఆందోళనకరంగా ఉందన్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించే డాక్టర్లు, వైద్య సహాయకులు, వైద్య విద్యార్థులతో పాటు…
ఏపీలో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు చేసిన దాడిని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖండించారు. టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడటం సరికాదన్నారు. ఏపీ చరిత్రలోనే ఇలాంటి దాడులు జరగలేదన్నారు. ప్రజాస్వామ్యానికి ఇలాంటి దాడులు మంచిదికాదని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ ఆఫీసులపై, నాయకుల ఇళ్లపై దాడులు మరిన్ని అరాచకాలకు దారితీస్తాయని పవన్ అన్నారు. వైసీపీ దాడులపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టాలని ఆయన కోరారు. దాడులు చేసినవారిని తక్షణమే శిక్షించాలని ఏపీ పోలీస్ శాఖను డిమాండ్ చేశారు.…
సినీనటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దూకుడు పెంచుతున్నారు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీతో హిట్ అందుకున్నారు. ఇదే సమయంలో వరుసగా నాలుగైదు సినిమాలకు కమిటై ఫుల్ బీజీగా మారిపోయాడు. దీంతో ఆయన రాజకీయంగా కొంత సైలంట్ అవుతారని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా జనసేనాని రాజకీయంగానూ దూకుడు చూపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ కు రాజకీయంగా చాలా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. 2014 ఎన్నికల…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.. పవన్, రాజమండ్రి సభకోసం జనసేన ఏర్పాట్లు చేస్తోంది. సర్కార్‌కు పవన్‌కు మధ్య తాజాగా రగులుతున్న రాజకీయం నేపథ్యంలో సత్తా చాటాలని జనసేన నేతలు భావిస్తున్నారు. భారీ ఎత్తున జనసమీకరణతో బలాన్ని నిరూపించే ప్రయత్నాల్లో ఉన్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీపైన పవన్ బహిరంగ సభ జరగాల్సి ఉంది. కానీ, పోలీసుల అనుమతి నిరాకరణతో రాజమండ్రి రూరల్ బాలాజీపేట సెంటర్‌కు…