జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ శనివారం నాడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీ శ్రేణులు దౌర్జన్యానికి పాల్పడి చింతా అనంతలక్ష్మీ పూరింటిని కూల్చివేశారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రాత్రికి రాత్రి 200 మంది రౌడీ మూకలతో ఈ ఘటన జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఆపదలో ఉన్న అనంతలక్ష్మీ కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ…
అన్ని రాజకీయ పార్టీలు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఫోకస్ పెడుతున్నాయి.. జనసేన పార్టీ కూడా క్రియాశీల సభ్యత్వ నమోదుపై దృష్టిసారించింది.. దీనికోసం జనసైనికులు, వీర మహిళలకు విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ నెల 21వ తేదీ నుంచి జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రకటించిన ఆయన.. జనసేన క్రియాశీల సభ్యత్వ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని పిలుపునిచ్చారు.. ప్రతీ నియోజకవర్గంలో కనీసం 2 వేల…
ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్‌ను బదిలీ చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈరోజు మధ్యాహ్నం వరకు విధుల్లో ఉన్న గౌతమ్ సవాంగ్‌ను ప్రభుత్వం ఆకస్మికంగా బాధ్యతల నుంచి తప్పించడం తనకు విస్మయం కలిగించిందన్నారు. అధికారులను నియమించుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న పాలనాపరమైన అధికారం కావొచ్చు… కానీ వైసీపీ ప్రభుత్వానికి డీజీపీని హఠాత్తుగా మార్చాల్సిన అవసరమేంటని పవన్ ప్రశ్నించారు. గౌతమ్ సవాంగ్ బదిలీపై గల కారణాలను ప్రభుత్వం ప్రజలకు వివరించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.…
తెలంగాణలో బుధవారం నుంచి మేడారం జాతర ప్రారంభమవుతున్న సందర్భంగా అడవి తల్లి బిడ్డలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. బుధవారం మొదలవుతున్న సమ్మక్క-సారలమ్మ జాతర భారతీయ సనాతన ధార్మిక విశిష్టతకు నిలువెత్తు నిదర్శనం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ దేవతలు అడవి బిడ్డల వీరత్వానికి ప్రతీకలు అని అభివర్ణించారు. దేశం నలుమూలల ఉన్న గిరిజనులు, గిరిజనేతరులు తమ ఇలవేల్పులుగా పూజిస్తున్న ఈ శక్తి స్వరూపిణీల…
రాజకీయ నాయకుడిగా మారిన నటుడు పవన్ కళ్యాణ్ ఒక కోట్ పోస్ట్ చేసారు. ఇది సినీ పరిశ్రమతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితిగా కనిపిస్తుంది. ఎలాంటి రిఫరెన్స్ తీసుకోకుండా లేదా ఎలాంటి ఉదంతాన్ని ఉటంకించకుండా, పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. “నాకు ఇష్టమైన వాటిలో ఒకటి: ‘ఎర’ను ఆహారం అనుకుని ఆశపడే స్థితిలో ఉన్న ప్రతిజాతి వేటగాళ్లకు చిక్కుతూనే ఉంటుంది…. – వాకాడ శ్రీనివాసరావు”. అని పోస్ట్ చేశారు. అయితే…
2014, మార్చి 14న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఆ పార్టీ రంగం సిద్ధం చేస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజలో ఈ వేడుకలను నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు మంగళగిరి మండలంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న రెండు స్థలాలను జనసేన నేత నాదెండ్ల మనోహర్ శుక్రవారం నాడు పరిశీలించారు. Read Also: Andhra Pradesh: ఏపీలో మార్చి…
ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ ఉద్యమం ఉధృతం రూపం దాల్చింది.. ఇవాళ నిర్వహించిన ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతం కావడంతో.. వారిలో మరింత పట్టుదల పెరిగింది.. రేపు సమావేశమై… భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధం అయ్యారు.. ఇదే సమయంలో సమ్మెకు సిద్ధం అవుతున్నారు.. ఇక, ఉద్యోగులకు క్రమంగా మద్దతు పెరుగుతోంది.. ఇవాళ ఉద్యోగుల ఉద్యమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు పలికారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ఆ కష్టాలు తనకు తెలుసునని.. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని ఇన్నాళ్లు…
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారు దుండగులు.. తిరుపతి సమీపంలో జనసేన కార్యకర్త సుహాన్ భాషాను అత్యంత కిరాతకంగా నరికి కత్తులతో నరికి చంపారు.. తిరుపతిలోని పేరూరు చెరువు వద్ద భాషాపై దాడి చేసి హతమార్చారు.. మృతుడు గాంధీపురానికి చెందిన సుహానా భాషాగా గుర్తించారు.. సమాచారం అందుకున్న జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు.. ఇక, స్థానిక నేతల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సుహాన్ భాషాను హత్య చేసి…