జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి… జనసేన ఆవిర్భావ సభ వేదికగా పవన్ చేసిన వ్యాఖ్యలపై ఇవాళ ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతీ ఎన్నికల్లో ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకోవటం పవన్ కళ్యాణ్‌కు అలవాటు అంటూ ఎద్దేవా చేశారు. ఒక్కో ఎన్నికల్లో పవన్ ఒక్కొక్కరిని తిడుతూ మాట్లాడుతారని విమర్శించిన ఆయన.. అప్పుడు తిట్టి ఇప్పుడు మళ్లీ తిరిగి చంద్రబాబుతో పొత్తుకు సిద్ధమవుతున్నారని.. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా పేదలకు ప్రభుత్వం…
జనసేన ఆవిర్భావ సభలో తనపై పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. పవన్ కళ్యాణ్ కేవలం సినిమాల్లోనే హీరో.. పొలిటికల్‌గా తాను హీరోనని మంత్రి అవంతి అన్నారు. పవన్‌కు అహంభావం ఎక్కువ అని.. అతడి సినిమాల్లో విజయాల కంటే ఎక్కువ పరాజయాలే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవటం తప్ప పవన్ వాస్తవాలు తెలుసుకోరా అంటూ ప్రశ్నించారు. మరోవైపు తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా గత మూడేళ్ల కాలంలో జనసేన కార్యకర్తలపై…
Janasena Chief Pawan Kalayan Speech At Janasena Formations Day Celebrations. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. 8 వసంతాలు పూర్తి చేసుకుని 9వ వసంతంలోకి అడుగు పెడుతున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరి సమీపంలోని ఇప్పటంలో భారీ బహిరంగ సభ కొనసాగుతుంది. ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా…
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామ పరిధిలో నేడు జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు భారీ బహిరంగ జరగనుంది. ఈ సభ ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరై ప్రసంగించనున్నారు. సభకు హాజరయ్యే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా 2024 ఎన్నికలకు జనసేన ఎలా ముందుకెళ్తుంది, ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారు అనే…
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామం పరిధిలో ఈనెల 14న జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. జనసేన పార్టీ స్థాపించి 8 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా నిర్వహించే ఈ సభకు రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందరినీ ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి జనసైనికులు, వీర మహిళలు, రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించే అందరూ ఆహ్వానితులేనని పవన్ కళ్యాణ్ తెలిపారు. సభలో వీరమహిళలు కూర్చునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఏపీ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని జనసైనికులకు దిశానిర్దేశం…
ఈనెల 14న గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభను నిర్వహించాలని జనసేన పార్టీ తలపెట్టింది. ఈ మేరకు ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఆవిర్భావ వేడుకలకు తమ వంతు సహకరించాలని ప్రవాసాంధ్రులను కోరుతూ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశారు. నాదెండ్ల పిలుపునకు ఇతర దేశాల్లోని జనసైనికులు భారీగానే స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశాల్లో…
జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆయన నటించిన భీమ్లానాయక్ సినిమాకు ఏపీలో పలు సమస్యలు ఎదురైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టిక్కెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం, అభిమానుల మధ్య వార్ ఇంకా నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని మరోసారి ప్రస్తావిస్తూ పోస్ట్ చేశారని అభిమానులు భావిస్తున్నారు. ఒక మార్పు కోసం యుద్ధం చేయాల్సి వస్తే.. తొంభై…
ఏపీలో భీమ్లా నాయక్ సినిమాపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో పవర్‌స్టార్ అభిమానులు మండిపడుతున్నారు. అదనపు షోలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసిన అంశంపై ప్రభుత్వం, జనసేన కార్యకర్తల మధ్య వివాదం చెలరేగుతోంది. అయితే ఈ వివాదంపై టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య స్పందించారు. ఉద్దేశపూర్వకంగానే ఏపీ ప్రభుత్వం భీమ్లా నాయక్ సినిమాపై చర్యలకు దిగుతోందని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. ఒక సినిమా పట్ల జగన్ సర్కారు…