ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రైతు సంక్షేమ యాత్రలో భాగంగా ధర్మవరం, బత్తలపల్లి ప్రాంతాల్లో పర్యటించనున్న ఆయన.. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు.. అంతేకాదు.. కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం చేయనున్నారు జనసేనాని.. సత్యసాయి, అనంతపురం జిల్లాలోని ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఆర్ధిక సాయం అందించి వారిలో ధైర్యం నింపేందుకు రైతుల కోసం తలపెట్టిన కౌలు రైతుల భరోసా యాత్రను మొట్టమొదటగా పవన్ కళ్యాణ్.. ఇవాళ…
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ మధ్య దూకుడు పెంచారు.. ఓవైపు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై దృష్టిసారించిన ఆయన.. పాత మంత్రుల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలి.. ఎవ్వరికి పార్టీ బాధ్యతలు అప్పగించాలి.. కొత్తవారు ఎవరైనా మంత్రులుగా బెటర్, సామాజిక సమీకరణలతో ఎవరికి అవకాశం ఇస్తే బాగుంటుంది అనే విషయాలపై కసరత్తు చేస్తున్నారు.. మరోవైపు ప్రత్యర్థులపై పదునైన మాటలతో విరుచుకుపడుతున్నారు. గత రెండ్రోజులు నుంచి బహిరంగ సభల్లో విమర్శల ధోరణి మార్చారు. హస్తిన పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత విపక్ష…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలురైతుల ఆత్మహత్యలపై పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు హయాంలో రైతుల ఆత్మహత్యలు జరిగితే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. చంద్రబాబు రైతులకు ఏం చేశారని పవన్ అప్పుడు మౌనం వహించారన్నారు. తమ ప్రభుత్వం తరహాలో రైతులకు వడ్డీ లేని రుణం ఇచ్చారా? వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చారా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం సునిశితంగా పరిశీలించి కౌలు…
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో పలు చోట్ల కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తిరుపతి నాలుగు కాళ్ల మండపం వద్ద టీడీపీ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. లాంతర్లు నెత్తిపై పెట్టుకుని విసనకర్రలతో విసురుకుంటూ బల్బులను మెడలో వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. చేతగాని సీఎం డౌన్ డౌన్ అంటూ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు నిర్మాత బండ్ల గణేష్ ఎంతటి భక్తుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కోసం ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధమంటూ చాలాసార్లు బండ్లన్న బాహాటంగానే చెప్పుకొచ్చాడు. ఇక మొన్నటికి మొన్న భీమ్లా నాయక్ వేదికపై బండ్ల గణేష్ పవర్ ఫుల్ స్పీచ్ ఉంటుంది అనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. ఇక ఆ తరువాత జనసేన ఆవిర్భావ సభలో తానూ పాల్గొంటామని బండ్లన్న ట్వీట్ వేయడంతో అక్కడ మిస్ అయినా ఈ…
సికింద్రాబాద్‌లోని బోయగూడలో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది కూలీలు సజీవదహనం అయ్యారు. ఈ విషయం తెలుసుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. అయితే ఈ ప్రెస్ నోట్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉండటం చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీ తెలుగులోనే ప్రెస్‌నోట్‌లను విడుదల చేస్తోంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఇంగ్లీష్‌లో ప్రెస్…
కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేసినా ఓడిస్తానని సవాల్ చేయడంపై నాదెండ్ల మనోహర్ స్పందించారు. ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యలు విని తనకు చాలా ఆశ్చర్యం కలిగిందన్నారు. ఆయనకు అంత అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందో అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను…
జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆ పార్టీ శ్రేణులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి… తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఎక్కనుండి పోటీ చేసినా నేను ఓడిస్తానని ప్రకటించారు.. కాకినాడలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్.. కాకినాడలో కొందరు చెంచాలు చెప్పే మాటలు నమ్మి నాపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.. వాస్తవాలు తెలుసుకుని నా గురించి మాట్లాడు అంటూ కౌంటర్ ఇచ్చిన ఆయన.. జనసేన నాయకులు, కార్యకర్తలకు పవన్…