తెలుగు చిత్రసీమలో వెలుగు చూసిన మల్టీస్టారర్స్ లో విజయావారి ‘గుండమ్మ కథ’ ప్రత్యేక స్థానం సంపాదించింది. పలు విశేషాలకు నెలవుగా ‘గుండమ్మ కథ’ నిలచింది. పౌరాణిక బ్రహ్మగా పేరొందిన కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన సాంఘిక చిత్రాలు కొన్నే. వాటిలో ఘనవిజయం సాధించిన ఏకైక చిత్రం ‘గుండమ్మ కథ’. మహానటుడు యన్టీఆర్ నూరవ చిత్రంగా తెరకెక్కిన సినిమా కూడా ఇదే! ఈ చిత్రం తమిళ వర్షన్ ‘మనిదన్ మారవిల్లై’ మరో మహానటుడు ఏయన్నార్ కు వందో సినిమా…
(మే 16తో ‘వీరకంకణం’కు 65 ఏళ్ళు) నటరత్న యన్టీఆర్ కథానాయకునిగా తెరకెక్కిన జానపద చిత్రం ‘వీరకంకణం’ ఆ రోజుల్లో జనాన్ని భలేగా అలరించింది. 1950లో ఎమ్.జి.రామచంద్రన్ హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘మంత్రి కుమారి’ ఆధారంగా ఈ ‘వీరకంకణం’ తెరకెక్కింది. ఆ సినిమాను నిర్మించిన మోడరన్ థియేటర్స్ సంస్థ ‘వీరకంకణం’ను తెలుగులోనూ నిర్మించింది. 1957 మే 16న ‘వీరకంకణం’ చిత్రం విడుదలయింది. ‘వీరకంకణం’ కథ ఏమిటంటే- ఓ దేశానికి రాజైన వెంగళరాయ దేవ అమాయకుడు. తమ రాజగురువు…
(ఫిబ్రవరి 20న ‘భాగ్యరేఖ’కు 65 ఏళ్ళు)పట్టుమని డజన్ సినిమాలు తీయలేదు. కానీ, దర్శకదిగ్గజం బి.యన్. రెడ్డి పేరు తెలుగు చలనచిత్రసీమలో సువర్ణాక్షర లిఖితమయింది. దక్షిణ భారతంలో తొలిసారి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న ఘన చరిత బి.యన్. రెడ్డి సొంతం. ఆయన రూపొందించిన చిత్రాలలో “మల్లీశ్వరి, రాజమకుటం” చిత్రాలు మినహాయిస్తే అన్నీ సాంఘికాలే. ఈ రెండు సినిమాల్లోనూ యన్.టి.రామారావు కథానాయకుడు కావడం విశేషం. యన్టీఆర్ తో బి.యన్. రెడ్డి తెరకెక్కించిన ఏకైక సాంఘిక చిత్రం ‘భాగ్యరేఖ’. 1957…
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు యన్.టి.రామారావు చలనచిత్ర జీవితాన్ని పరిశీలిస్తే, ఆయన చేసిన సాహసాలు, అందుకు జనం మెచ్చి ఇచ్చిన విజయాలు ఆశ్చర్యం కలిగించక మానవు. ఓ వైపు హీరోగా విజయయాత్ర చేస్తూన్న యన్టీఆర్ 1960లో దర్శకత్వం చేపట్టాలని భావించారు. ‘సీతారామకళ్యాణం’లో రావణబ్రహ్మ పాత్రలో నటించి, దర్శకత్వం వహించి మెప్పించారు. ఆ సినిమాకు దర్శకునిగా తన పేరు ప్రకటించుకోలేదు. ఆ తరువాతి సంవత్సరం మరో ప్రయత్నంగా దర్శకత్వం వహిస్తూ, నటించి ‘గులేబకావళి కథ’ తెరకెక్కించారు. ఈ చిత్రానికి కూడా దర్శకునిగా…
తమ భూముల వ్యవహారంలో మెదక్ కలెక్టర్ హరీష్ చేసిన వ్యాఖ్యలపై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల భార్య జమున స్పందించారు. జమున హేచరీస్‌కు సంబంధించిన భూములను ఈటల బలవంతంగా ఆక్రమించుకున్నారని కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమన్నారు. భూముల అంశం కోర్టు పరిధిలో ఉందని… తమకు ఎటువంటి వివరాలు ఇవ్వకుండా కలెక్టర్ హరీష్ ప్రెస్ మీట్ ఎలా పెడుతారని జమున ప్రశ్నించారు. కలెక్టర్లు ప్రెస్ మీట్ పెట్టడానికే ఉన్నారా? కలెక్టర్ ఏమైనా రాజకీయ నాయకుడా? టీఆర్ఎస్ ప్రభుత్వానికి క్లర్క్‌గా…
నటరత్న యన్.టి.రామారావు హీరోగా ఎ.సి.త్రిలోక్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పవిత్ర హృదయాలు’ చిత్రం పార్ట్ లీ కలర్ లో రూపొందింది. 1971లో యన్టీఆర్ నటించిన ఎనిమిదవ చిత్రమిది. ఆ యేడాది తెలుగునాట రంగుల చిత్రాల హవా విశేషంగా వీచడం మొదలయింది. ఈ నేపథ్యంలో ‘పవిత్ర హృదయాలు’లో కొన్ని పాటలు రంగుల్లో దర్శనమిచ్చాయి. అనేక చిత్రాలలో యన్టీఆర్ కు చెల్లెలిగా నటించిన చంద్రకళ, ‘మాతృదేవత’ చిత్రంలో కూతురుగానూ అభినయించింది. యన్టీఆర్ సరసన నాయికగా ఆమె తొలిసారి ‘తల్లా?పెళ్ళామా?’లో నటించగా,…
(సెప్టెంబర్ 29న యన్టీఆర్ ‘అడుగుజాడలు’కు 55 ఏళ్ళు) నటరత్న యన్టీఆర్, నటచక్రవర్తి యస్వీఆర్ డాక్టర్లుగా నటించిన చిత్రం ‘అడుగుజాడలు’. తాపీ చాణక్య దర్శకత్వంలో నవజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై ఎమ్.సాంబశివరావు, జి.వందనం ‘అడుగుజాడలు’ నిర్మించారు. ఈ చిత్రంలో జమున నాయికగా నటించారు. 1966 సెప్టెంబర్ 29న ఈ సినిమా విడులయింది. ‘అడుగుజాడలు’ కథ విషయానికి వస్తే- డాక్టర్ కృష్ణ ఎంతో మేధావి. తన వైద్యంతోనూ, మంచితనంతోనూ దుర్మార్గులను సైతం సన్మార్గంలో నడిపిస్తూ ఉంటారు. పోలియోకు అప్పట్లో తగిన వైద్యం…
(సెప్టెంబర్ 3న జమున ‘బంగారుతల్లి’కి 50 ఏళ్ళు) కళారంజని జమున అభినయ పర్వంలో మరపురాని చిత్రాలు అనేకం. వాటిలో ‘బంగారుతల్లి’ మరింత ప్రత్యేకం. హిందీలో నర్గీస్ ప్రధాన పాత్ర పోషించిన ‘మదర్ ఇండియా’ ఆధారంగా ‘బంగారు తల్లి’ తెరకెక్కింది. ‘మదర్ ఇండియా’ టైటిలే జనాన్ని విశేషంగా అలరించింది. ఇక ఆ సినిమా పలు ప్రత్యేకతలకు వేదికగా నిలచింది. ఆ చిత్ర దర్శకనిర్మాత మెహబూబ్ ఖాన్ 1940లోనే ‘ఔరత్’ అనే సినిమా తెరకెక్కించారు. అందులో భర్త చనిపోయి, ఇద్దరు…
(ఆగస్టు 30న జమున పుట్టినరోజు) నటి జమున పేరు వినగానే ఆ నాటి ఆమె అందాలరూపాన్నే ఊహించుకొనే అభిమానులు ఎందరో ఉన్నారు. తెలుగు చిత్రసీమలో ఎక్కువ కాలం నాయికగా నటించిన ఘనతను జమున సొంతం చేసుకున్నారు. తనకంటే వయసులో చిన్నవారి సరసన సైతం హీరోయిన్ గా నటించి మెప్పించారామె. ఇక నాటి మేటి నటులతో జమున తనదైన బాణీ పలికిస్తూ నటించిన తీరును అభిమానులు ఇప్పటికీ మననం చేసుకొని ఆనందిస్తూ ఉంటారు. సత్యభామగా తెరపై ఆమె అభినయించిన…
(జూలై 16తో ‘శ్రీమంతుడు’కు 50 ఏళ్ళు) విశ్వభారతి ప్రొడక్షన్స్ పతాకంపై కె.ప్రత్యగాత్మ దర్శకత్వంలో నటసమ్రాట్ ఏయన్నార్, జమున జంటగా రూపొందిన చిత్రం ‘శ్రీమంతుడు’. ప్రత్యగాత్మ, ఏయన్నార్ కాంబినేషన్ లో పలు చిత్రాలు రూపొంది, మంచి విజయం సాధించాయి. అదే తీరున ‘శ్రీమంతుడు’ కూడా పాటలతో అలరిస్తూ ఆదరణ పొందింది. 1971 జూలై 16న విడుదలయిన ఈ చిత్రం టాక్ బాగానే ఉన్నా, అప్పటి ఏయన్నార్ రంగుల చిత్రాల హవా ముందు నిలవలేకపోయిందనే చెప్పాలి. కథేమిటంటే… ‘శ్రీమంతుడు’ కథ…