Rahul Gandhi: జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ భూముల ఆక్రమణకు వ్యతిరేఖంగా కూల్చివేతలు జరుగుతున్నాయి. అయితే దీనిపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజలు ఏళ్ల తరబడి కష్టపడి నిర్మించుకున్న కట్టడాలను ప్రభుత్వం కూల్చివేస్తోందని బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఈ ప్రాంత ప్రజలు బీజేపీని ఎదుర్కోవాల్సిందే అని అన్నారు.
Lithium: అత్యంత విలువైన లిథియం ఖనిజ నిల్వలు జమ్మూకాశ్మీర్ లో వెలుగులోకి వచ్చాయి. దాదాపుగా 60 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీంతో రానున్న రోజుల్లో భారత్ దిశమారబోతోంది. అయితే దీన్ని కనుగొనేందుకు దాదాపుగా 26 ఏళ్ల శ్రమ దాగుంది. 26 ఏళ్ల క్రితమే జీఎస్ఐ జమ్మూ కాశ్మీర్ లోని సలాల్ ప్రాంతంలో లిథియం ఉనికి గురించి ఒక వివరణాత్మక నివేదిక అందించింది. అయితే అప్పుడు దీన్ని పెద్దగా…
All about lithium, could change India's fate: జమ్మూ కాశ్మీర్ రియాసి జిల్లాలో చాలా విలువైన లిథియం ఖనిజం భారీ నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఏకంగా 60 లక్షల టన్నుల ఖనిజం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ లిథియం భారతదేశ భవితను మార్చబోతుందా..? అంటే ఔననే సమాధానం వస్తుంది. కాస్మిక్ మెటల్ గా పేరొందిన లిథియంకు ప్రస్తుతం మార్కెట్ లో భారీగా డిమాండ్ ఉంది. రాబోయే కాలం ఎలక్ట్రానిక్స్, ఈవీ…
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు ఆరుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి భారీ ఎత్తు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కుల్గామ్ లో భద్రతా బలగాలు శుక్రవారం జైషే మహ్మద్ మాడ్యూల్ ను చేధించారు. ఆరుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి హ్యాండ్ గ్రెనేడ్, పిస్టల్, రెండు మోర్టల్ షెల్స్, భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Teacher Arrested For Blasts In Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్ లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు లష్కరే తోయిబా ఉగ్రవాదిగా మారి బాంబు దాడులకు తెగబడ్డాడు. తాజాగా ఇతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైష్ణో దేవి యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సులో ఒకదానితో సహా పలు పేలుళ్లకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా మారిన లష్కరే తోయిబా ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్ గురువారం తెలిపారు.…
కాంగ్రెస్ ఎంపీ, అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం పూర్తి కాగా.. శ్రీనగర్లో సోమవారం కాంగ్రెస్ ఘనంగా ముగింపు వేడుకలు నిర్వహిస్తోంది.
కాంగ్రెస్ ఎంపీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సోమవారం శ్రీనగర్లోని షేర్-ఏ-కశ్మీర్ స్టేడియంలో ముగుస్తుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భావసారూప్యత కలిగిన 23 పార్టీలకు ఆహ్వానం పంపింది.
Rahul Gandhi spreading divisive agenda, says BJP: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ జమ్మూ కాశ్మీర్ చేరుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పిస్తోంది. రాహల్ గాంధీ విభజన ఎజెండాను వ్యాప్తి చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఆరోపించారు.