లోక్ సభ ఎన్నికల్లో నేపథ్యంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాలలో చురుకుగా పాల్గొంటున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఓ కీలక హామీని ఇచ్చాడు. అతి త్వరలో జమ్మూ కాశ్మీర్ కొత్తగా రాష్ట్ర హోదా కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఆ తర్వాత కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని ఆయన చెప్పుకొచ్చాడు.
Also Read: Rohit Sharma: కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన రోహిత్ శర్మ..
ముందుగా ఎన్నికల తర్వాత జమ్ము కాశ్మీర్ కు సంబంధించిన రాష్ట్ర హోదా కల్పించి., ఆపై రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. తను ఎప్పుడు ముందు చూపుతోనే ఆలోచిస్తానని.. చెబుతూ ప్రస్తుతం కూడా మీరు చూస్తున్నది కేవలం ట్రైలర్ అంటూ తెలిపారు. ఇకపోతే బీజేపీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ఏ విధంగా తీర్చిదిద్దే పనిలో ఉందో తెలుపుతూ.. కాశ్మీరును రానున్న రోజుల్లో అందమైన సినిమాల చూపిస్తామని జమ్మూ ప్రజలకు మాటిచ్చారు.
Also Read: Pinipe Viswarupu: చంద్రబాబు నాపై ఆరోపణలు నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా..
ఇక ఇక్కడి ప్రజలకు రాష్ట్ర హోదా కల్పించిన తర్వాత రాష్ట్ర ప్రజలు వారు ఎమ్మెల్యేలతో మంత్రులతో నేరగా మాట్లాడే అవకాశం లభిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రలకున్న సమస్యలను అతి తక్కువ సమయంలో తీరుతాయని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. ఎన్నికల నేపథ్యంలో భాగంగా శుక్రవారం నాడు ఉదంపూర్ లో నిర్వహించిన ర్యాలీలో భాగంగా ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.