2019 ఆగష్టులో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రాష్ట్ర హోదాను రద్దుచేసి లడక్‌ను విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత మొదటి జాతీయ స్థాయి రాజకీయ చర్చ జరిగింది. ఈ రోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ ఒమర్ అబ్దుల్లాలు, గులాం నబీ ఆజాద్, మెహబూబా ముఫ్తిలతో పాటు బిజెపి నేత రవీంద్రరైనా నిర్మల్ సింగ్, సిపిఎం నాయకుడు ఎంఎల్‌ఎ యూసప్ తరగామి, ఆప్…
2019 ఆగస్ట్ 5 వ తేదీన జమ్మూకాశ్మీర్‌కు సంబందించి ఆర్టికల్ 370 ని రద్దు చేయడమే కాకుండా, జమ్మూకాశ్మీర్‌ను రెండు రాష్ట్రాలుగా విభజించి యూటీలుగా చేసింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర హోదాను కోల్పోవడంతో ఆ రాష్ట్రంలో అనేక అల్లర్లు జరిగాయి. ముఖ్యనేతలను గృహనిర్బంధం చేశారు. పరిస్థితులు చక్కబడటంతో ఈరోజు ఢిల్లీలో ప్రధాని మోడి జమ్మూకాశ్మీర్ నేతలతో సమావేశం కాబోతున్నారు. మొత్తం 14 మంది నేతలకు ఆహ్వానాలు పంపారు. నిన్న సాయంత్రమే ఈ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. Read:…
అక్షయ్ కుమార్ తన దాతృత్వం మరోసారి చాటుకున్నాడు. అలాగే, దేశ భద్రతా దళాలపై తనకున్న గౌరవాన్ని కూడా మళ్లీ ఆయన ఋజువు చేసుకున్నాడు. జూన్ 16న జమ్మూలోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉన్న తులైల్ ప్రాంతాన్ని సందర్శించాడు. అక్కడి బీఎస్ఎఫ్ జవాన్లతో మాటామంతీ సాగించిన ఆయన స్కూల్ భవనం కోసం కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు!మారుమూల పల్లెలో అక్షయ్ విరాళంతో నిర్మించబోయే పాఠశాలకి ఆయన తండ్రి హరీ ఓం పేరును పెట్టనున్నారు. అయితే, జమ్మూలోని బందిపోరా…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ జమ్మూ కశ్మీర్ లోని తులైల్ క్యాంపును సందర్శించారు. ఈమేరకు తన హృదయం పూర్తిగా జవాన్ల పట్ల గౌరవంతో నిండిపోయిందని అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అక్కడ సరిహద్దు భద్రతా విధులు నిర్వర్తిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లతో ఉల్లాసంగా గడిపారు. వారితో కలిసి డ్యాన్సులు చేసిన అక్షయ్ కుమార్, సరదాగా వాలీబాల్ కూడా ఆడారు. కాగా ఉత్తర కశ్మీర్‌లోని బంధీపురా జిల్లాలో నీరు గ్రామ పాఠశాల భవన నిర్మాణానికి…
కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఇప్పుడున్న ఏకైకమార్గం వ్యాక్సినేషన్ ఒకటే.. కానీ, వ్యాక్సినేషన్‌పై ఇప్పటికే ఎన్నో అనుమానాలున్నాయి.. పట్టణాలు, నగరాలు కూడా వీటికి మినహాయింపు కాదు.. ఇక, గ్రామీణ ప్రాంతాల్లో అయితే, వ్యాక్సిన్ అంటేనే నాకు వద్దు బాబోయ్ అనేవారు ఉన్నారు.. కానీ, ఓ మారుమూల గ్రామంలో.. వందకు వందశాతం మంది వ్యాక్సిన్ తీసుకుని రికార్డు కెక్కారు.. ఈ అరుదైన ఘనత సాధించింది జమ్మూ కశ్మీర్‌లోని బందిపోరా జిల్లా వేయాన్ గ్రామం.. అక్కడ 18 ఏళ్లు పైబడిన…
కరోనా సెకండ్ వేవ్ కారణంగా జమ్మూ కాశ్మీర్ లో కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. కాగా ఈ నెల 24తో కరోనా నియంత్రణలు ముగియనుండటంతో మహమ్మారి కట్టడికి కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కర్ఫ్యూను మే 31 వరకూ పొడిగించినట్టు జమ్ము కశ్మీర్ అధికార యంత్రాంగం శనివారం వెల్లడించింది. కర్ఫ్యూ నుంచి నిత్యావసర వస్తువులు, అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు.