2019 ఆగస్ట్ 5 వ తేదీన జమ్మూకాశ్మీర్‌కు సంబందించి ఆర్టికల్ 370 ని రద్దు చేయడమే కాకుండా, జమ్మూకాశ్మీర్‌ను రెండు రాష్ట్రాలుగా విభజించి యూటీలుగా చేసింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర హోదాను కోల్పోవడంతో ఆ రాష్ట్రంలో అనేక అల్లర్లు జరిగాయి. ముఖ్యనేతలను గృహనిర్బంధం చేశారు. పరిస్థితులు చక్కబడటంతో ఈరోజు ఢిల్లీలో ప్రధాని మోడి జమ్మూకాశ్మీర్ నేతలతో సమావేశం కాబోతున్నారు. మొత్తం 14 మంది నేతలకు ఆహ్వానాలు పంపారు. నిన్న సాయంత్రమే ఈ నేతలు ఢిల్లీ చేరుకున్నారు.
Read: సంక్రాంతి రేసులో “అయ్యప్పనుమ్ కోషియం” రీమేక్?
జమ్మూకాశ్మీర్ అంశంపై ప్రధానితో చర్చలు జరగబోతున్న నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లో 48 గంటలపాటు హైఅలర్ట్ ప్రకటించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ఈ భద్రతను సమీక్షిస్తున్నారు. కేంద్రం అజెండా ఎంటి? సమావేశంలో వేటిగురించి ప్రధాని తమతో చర్చించబోతున్నారు అన్నది తమవద్ద కూడా స్పష్టత లేదని, జమ్మూకాశ్మీర్ అంశంపై చర్చలు జరుగుతున్నాయి కాబట్టి తాము హాజరవుతున్నామని నేతలు చెబుతున్నారు. జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్రహోదా ఇస్తామని గతంలో కేంద్రం చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపైనే ఈరోజు ప్రధాని జమ్ముకాశ్మీర్ నేతలతో చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.